Begin typing your search above and press return to search.

అమ్మ లాంటి అమ్మాయినే అమ్మ వెతుకుతుంది

By:  Tupaki Desk   |   5 Jan 2016 9:30 AM GMT
అమ్మ లాంటి అమ్మాయినే అమ్మ వెతుకుతుంది
X
కుర్ర హీరోల్లో బాగా స్పీడ్ మీద ఉండి, హ్యాట్రిక్ హిట్స్ కూడా సాధించాడు నిఖిల్. ఇప్పుడీ కుర్రాడు థర్టీస్ లోకి వచ్చేశాడు. మరి ముప్ఫైల్లోకి వచ్చాక పేరెంట్స్ ఆలోచించేది కొడుకు పెళ్లి గురించే కదా. అందుకే నిఖిల్ తల్లిదండ్రులు అమ్మాయిని వెతకడంలో బిజీ అయిపోయారు. అయితే.. పెళ్లి విషయంలో మాత్రం నిఖిల్ కి నిశ్చితాభిప్రాయాలు బాగానే ఉన్నాయి.

సినిమాల్లో అమ్మాయిల వెంటబడుతుంటాను కానీ.. రియల్ లైఫ్ లో అయితే.. అమ్మానాన్న చూసిన అమ్మాయినే చేసుకుంటానని తేల్చేశాడు. అంతే కాదు.. పెళ్లి విషయంలో గతంలోనే పేరెంట్స్ కి ఓ ప్రామిస్ కూడా చేశాడట. వరుసగా రెండు హిట్స్ కొట్టిన తర్వాతే పెళ్లి సంగతి ఆలోచిస్తానని చెప్పానన్నాడు నిఖిల్. ఆ తర్వాత స్వామి రారా - కార్తికేయ - సూర్య వర్సెస్ సూర్యలతో హ్యాట్రిక్ విజయాలు సాధించాక.. పేరెంట్స్ నుంచి ఇతగాడికి ప్రెజర్ ఎక్కువైంది. మరో హిట్ కొట్టేవరకూ ఆగమని అడిగినా వారు ససేమిరా అనడంతో.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశానన్నాడు. దీంతో ఇప్పుడు పెళ్లి కూతరి వేటలో పడిపోయారు వాళ్లు.

'నన్ను నన్నుగా అర్ధం చేసుకునే భార్య దొరికితే చాలు. నాకు తెలిసీ నా కంటే మంచి వ్యక్తినే నాకు భార్యగా తెస్తారు మా వాళ్లు. నేను ఎలాగూ పర్ఫెక్ట్ జోడీని వెతుక్కోలేదు. బహుశా ఈ ఏడాది చివరకు నాకు జంట దొరుకుతుందని అనుకుంటున్నా. మా అమ్మ నా కోసం తనలాంటి అమ్మాయినే వెతుకుతుందని భావిస్తున్నా' అంటున్నాడు నిఖిల్. కుర్రాడి స్పీడ్ చూస్తుంటే.. 2016లోనే పప్పన్నం పెట్టించేసేట్టు ఉన్నాడు కదూ. బెస్టాఫ్ లక్ నిఖిల్.