Begin typing your search above and press return to search.
నిఖిల్.. ఇంతకంటే లక్కీ ఛాన్స్ ఏముంటుంది?
By: Tupaki Desk | 1 Dec 2015 1:30 PM GMTఓ చిన్న సినిమా పోటీ లేకుండా.. మంచి హైప్ మధ్య విడుదలైతే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు. ఇలాంటి అవకాశం చాలా తక్కువ సినిమాలకే వస్తుంది. అలాంటి అదృష్టం నిఖిల్ సినిమా ‘శంకరాభరణం’కే దక్కింది. ఈ శుక్రవారమే ‘శంకరాభరణం’ ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఐతే వాస్తవానికి ఈ వీకెండ్ లో దీనికి పోటీగా ఇంకో రెండు సినిమాలు విడుదల కావాల్సింది. రామ్ గోపాల్ వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’తో పాటు సూర్య డబ్బింగ్ మూవీ ‘మేము’ కూడా డిసెంబరు 4కే షెడ్యూల్ అయ్యాయి. ఐతే ఈ రెండూ కూడా అనివార్య కారణాలతో వాయిదా పడ్డాయి. దీంతో ‘శంకరాభరణం’ సోలోగా రిలీజవుతోంది.
ఓ పెద్ద సినిమాకున్న స్థాయిలో హైప్ ఉంది ఈ మూవీకి. టీజర్ - ట్రైలర్ - ప్రోమోస్ అన్నీ కూడా ఆసక్తికరంగా ఉండటం.. నిఖిల్ వరుసగా డిఫరెంట్ సినిమాలే ఎంచుకుంటుండటం.. కోన వెంకట్ హ్యాండ్ ఉండటం.. ప్రమోషన్ కూడా భారీగా చేయడంతో ‘శంకరాభరణం’ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలున్నాయి. కంటెంట్ ఉంటే చిన్న సినిమాల కలెక్షన్ల రికార్డుల్ని ‘శంకరాభరణం’ తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. నిఖిల్ - నందిత - అంజలి - సంపత్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఉదయ్ నందనవనం దర్శకత్వం వహించాడు. కోన వెంకట్ కథ - స్క్రీన్ ప్లే - మాటలు అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా ఉంటూ దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశాడు ఈ సినిమాకు.