Begin typing your search above and press return to search.

నిఖిల్ పాన్ ఇండియా స్టార్ డ‌మ్ పై ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌

By:  Tupaki Desk   |   19 May 2023 8:00 AM GMT
నిఖిల్ పాన్ ఇండియా స్టార్ డ‌మ్ పై ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌
X
వ‌రుస‌గా గూఢ‌చారి క‌థ‌ల‌తో సినిమాలు దూసుకొస్తున్నాయి. టాలీవుడ్ బాలీవుడ్ లో ఇప్పుడు ఇదే ట్రెండ్. అటు బాలీవుడ్ లో `టైగ‌ర్` ఫ్రాంఛైజీ నుంచి మూడో సినిమా(టైగ‌ర్ 3)తో స‌ల్మాన్ స్పై ఆప‌రేష‌న్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇందులో మ‌రో స్పై ప‌ఠాన్ (షారూఖ్) బ‌రిలో దిగ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. మునుముందు బాలీవుడ్ లో వ‌రుస‌గా స్పై సినిమాల వెల్లువ కొన‌సాగ‌నుంది. స్పై యూనివ‌ర్శ్ ల‌తో య‌ష్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్ వేల కోట్లు కొల్ల‌గొట్టాల‌న్న క‌సితో ప్లాన్ చేస్తోంది.

టాలీవుడ్ లోను మ‌న ఫిలింమేక‌ర్స్ ఆలోచ‌న‌లు దిగ‌దుడుపుగా ఏం లేవ్. మారిన పాన్ ఇండియా ట్రెండ్ ని ఎన్ క్యాష్ చేసుకునేందుకు యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న క‌థాంశాల్ని ఎంచుకుని జాతీయ స్థాయి మీడియాలో డిబేట‌బుల్ గా మారేలా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. వివాదాస్ప‌ద టాపిక్ ల‌ను ఎంపిక చేసుకుని గ‌ట్సీగా సినిమాలు తీస్తున్నారు. ఒక‌ర‌కంగా బాలీవుడ్ కంటే ఒక‌డుగు ఎత్తుగ‌డ‌లో ముందుకు దూసుకెళ్లే ప్ర‌య‌త్నం సాగుతోంది ఇక్క‌డ‌. ఇది మంచి ప‌రిణామం అనే చెప్పాలి.

ఇప్పుడు తెలుగు చిత్ర‌సీమ‌లో ఒకేసారి ఒకే వ్య‌క్తి క‌థ‌తో రెండు స్పై ఆప‌రేష‌న్ సినిమాలు రిలీజ‌వుతుండ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. దీనిపై మీడియా నుంచి ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. క‌ల్యాణ్ రామ్ డెవిల్... నిఖిల్ న‌టించిన `స్పై` సినిమాలు ఒకే వీరుని(నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ నిజ జీవిత‌) క‌థ‌తో తెర‌కెక్కిన‌వి అన్న ప్ర‌చారం సాగుతోంది. అయితే దీనికి తాజాగా స్పై ప్ర‌మోష‌న్స్ లో నిఖిల్ త‌న‌దైన శైలిలో వివ‌ర‌ణ ఇచ్చాడు. ఈ రెండు సినిమాల నేప‌థ్యం నేతాజీతో ముడిప‌డి ఉన్నా.. విభిన్న కాలాదుల్లో సాగే క‌థాంశాల‌తో తెర‌కెక్కాయ‌ని నిఖిల్ స్పష్ఠం చేశాడు. వారి సినిమా 1920ల‌లో ర‌న్ అయితే మా క‌థాంశం ప్రెజెంట్ క‌నెక్టివిటీతో ఫిక్ష‌న‌లైజ్ చేసి ఉంటుంద‌ని వెల్ల‌డించాడు.

అయితే నిఖిల్ గ‌త చిత్రం కార్తికేయ 2 ఉత్త‌రాదినా బాగా ఆడింది. దీంతో `స్పై` బ‌డ్జెట్ స్పాన్ మారిందా? అన్న ప్ర‌శ్న‌కు కూడా నిఖిల్ తెలివైన జ‌వాబిచ్చాడు. నిజానికి కార్తికేయ 2 ఒక అద్భుతం. ఉత్త‌రాదినా ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. అలాగ‌ని కార్తికేయ 2 త‌ర్వాత వ‌స్తున్న సినిమాకి బ‌డ్జెట్ ని పెంచ‌లేదు. నిజానికి కార్తికేయ 2 కంటే ముందే అంగీక‌రించిన సినిమా ఇది. నేను నా నిర్మాత‌ల‌ను ఎక్క‌డా బ‌డ్జెట్ గురించి ఇబ్బందిపెట్ట‌లేదు. ప‌రిమిత బ‌డ్జెట్లోనే గ్రాండియ‌ర్ విజువ‌ల్స్ ని చూపించాం.. అని వివ‌ర‌ణ ఇచ్చాడు. స్పై సినిమా పాన్ ఇండియా లేదా పాన్ వ‌ర‌ల్డ్ సినిమా అనుకోవ‌చ్చా? అన్న ప్ర‌శ్న‌కు.. నిఖిల్ చాలా ఒద్దికైన స‌మాధాన‌మిచ్చాడు. ఎంపిక చేసుకున్న కంటెంట్ విశాల ధృక్ప‌థంతో ఉన్న‌ది. ఉన్న వాస్త‌వాల‌ను ఉన్న‌వి ఉన్న‌ట్టుగా ఏం జ‌రిగిందో చూపిస్తూనే 10శాతం సినిమాని ఫిక్ష‌న‌లైజ్ చేశామ‌ని నిఖిల్ అన్నారు.

నేతాజీ క‌థ‌లో గ‌గుర్పొడిచే సంఘ‌ట‌న‌ల‌ను య‌థాత‌థంగా తెర‌పై చూపిస్తున్నామ‌ని అవ‌స‌రం మేర ఫిక్ష‌న్ సీన్స్ క‌నిపిస్తాయ‌ని అన్నారు. ఈ చిత్రంలో సుభాష్ చంద్ర‌బోస్ చ‌నిపోయారా లేదా? అన్న‌ది మీరు తెర‌పైనే చూసి తెలుసుకోవాల‌ని కూడా నిఖిల్ తెలివైన స‌మాధాన‌మిచ్చారు. నేతాజీ మ‌ర‌ణంపై బోలెడంత రీసెర్చ్ చేశాకే నాటి పెద్ద‌లు పుస్త‌క‌ర‌చ‌యిత‌ల‌తో అధికారికంగా కంటెంట్ ని ధృవీక‌రించుకున్నాకే సినిమా తీశామ‌ని కూడా ద‌ర్శ‌క‌హీరోలు వెల్ల‌డించారు. స్పై ప్ర‌మోష‌న్స్ లో మీడియా విలేఖ‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు నిఖిల్ ఎంతో ప‌రిణ‌తితో స‌మాధామివ్వ‌డం మెప్పించింది.

నిజానికి ఎంపిక చేసుకునే కంటెంటే పాన్ ఇండియా స్టార్ డ‌మ్ ని అందిస్తుంది. ఆ ర‌కంగా చూస్తే ఇప్పుడు స్పై కంటెంట్ క‌చ్ఛితంగా పాన్ ఇండియాలో మెప్పించేదేన‌ని న‌మ్మొచ్చు. నేతాజీ మ‌ర‌ణం మిస్టరీపై ఎన్నో క‌థ‌లున్నాయి. వాటిలో ఏది నిజం? ఏది అబద్ధ‌మో ఎవ‌రూ ధృవీక‌రించ‌లేరు. కానీ సినిమా తెర‌పై ఎలా చూపించారు? అన్న‌ది క్యూరియ‌స్ ఎలిమెంట్. అయితే ఈ సినిమాని తెర‌కెక్కించిన విధానం గ్రిప్పింగ్ నేరేష‌న్ పాన్ ఇండియాలో హిట్టు కొట్టేందుకు స‌హ‌క‌రిస్తుంది. ప్ర‌ముఖ ఎడిట‌ర్ కం డైరెక్ట‌ర్ గ్యారీ దీనిని నేరేట్ చేశారు కాబ‌ట్టి స్పై పై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. స్పై సినిమా ఉత్త‌రాదినా బాక్సాఫీస్ వ‌ద్ద విజయం సాధిస్తే ఉత్త‌రాది మార్కెట్లో యువ‌హీరో నిఖిల్ ఇమేజ్ మ‌రింత పెరుగుతుంది. అత‌డి పాన్ ఇండియా స్టార్ డ‌మ్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుంద‌న‌డంలో సందేహం లేదు.