Begin typing your search above and press return to search.
ఆ దర్శకుడిలోనూ స్పార్క్ కనిపించింది-నిఖిల్
By: Tupaki Desk | 14 Nov 2016 11:30 AM GMT‘స్వామి రారా’ రాక ముందు నిఖిల్ ఒక రకం.. ఆ సినిమా తర్వాత అతనో రకం. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ.. డిఫరెంట్ డైరెక్టర్లతో పని చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్. అతడి కెరీర్ ను మలుపు తిప్పిన దర్శకుల్లో ముందు సుధీర్ వర్మ.. ఆ తర్వాత చందూ మొండేటి పేర్లు చెప్పాలి. వీళ్లిద్దరి లాగే వీఐ ఆనంద్ కూడా తన కెరీర్లో కీలకమైన దర్శకుడని అంటున్నాడు నిఖిల్. సుధీర్.. చందూల్లో చూసిన స్పార్క్.. అంతకంటే ఎక్కువ ప్రతిభ వీఐ ఆనంద్ లో చూశానని నిఖిల్ చెప్పాడు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తన కెరీర్లో మైల్ స్టోన్ లాంటి మూవీ అని అతనన్నాడు.
‘‘స్వామి రారా.. కార్తికేయ సినిమాలు నా కెరీర్లో ఎంత ప్రత్యేకమో.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ కూడా అంతే ప్రత్యేకం. ఆనంద్ గారు తన కథకు నన్ను హీరోగా ఎంచుకోవడం నా అదృష్టం. ఆయన కథ చెప్పడానికి నా దగ్గరికి వచ్చి నరేషన్ మొదలుపెట్టిన ఐదు పది నిమిషాలకే నేను చేయబోయేది మామూలు సినిమా కాదనిపించింది. సుధీర్.. చందూల్లో చూసిన స్పార్క్ ఈయనలోనూ గమనించాను. ఆయనలో అసాధారణ ప్రతిభ ఉంది. నాతో ఇంకో సినిమా చేయాలని కూడా ఆనంద్ ను అడిగాను. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం 500.. 1000 నోట్ల రద్దుతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. సినిమాల పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అయినా ఈ శుక్రవారం మా సినిమాను ఆదరిస్తారని.. మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా’’ అని నిఖిల్ చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/