Begin typing your search above and press return to search.

ఇప్పుడు కావాల్సింది అదే

By:  Tupaki Desk   |   19 April 2018 8:48 AM GMT
ఇప్పుడు కావాల్సింది అదే
X
కాస్టింగ్ కౌచ్ పై పోరాటం అంటూ లైమ్ లైట్ లోకి వచ్చిన శ్రీరెడ్డి కొద్దికాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ ఇష్యూతో ఏ మాత్రం సంబంధం లేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకోవడంతో మొత్తం ఇష్యూ కొత్త టర్న్ తీసుకుంది. పైగా పవన్ కళ్యాణ్ ను తిట్టి పేరు తెచ్చుకోవాలంటూ ఈ సలహా తానే ఇచ్చానంటూ రామ్ గోపాల్ వర్మ ఓపెనవడం అభిమానులకు కొత్త షాకిచ్చింది.

ఈ వ్యవహారంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా రియాక్ట్ అవుతున్నారు. పవన్ అభిమాని.. యంగ్ హీరో నిఖిల్ ఈ విషయంలో కాస్త డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు కావాల్సింది సహనమేనంటూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ షేర్ చేశాడు. ఎక్కడా ఎవరి పేరు ప్రసావించకుండానే తను చెప్పదల్చుకున్నది ఘాటుగానే చెప్పాడు‘‘ఇడియట్ల గురించి.. వాళ్లు చేసే ఇడియాటిక్ కామెంట్లను పట్టించుకోవడం.. వాటికి స్పందించడం ద్వారా వాళ్లకు అనవసరమైన ప్రాధాన్యం ఇస్తున్నాం. వాళ్లకు లేనిపోని క్రెడిబిలిటీ ఇస్తున్నట్లవుతోంది. ముందుముందు మనం సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఈ టైంలో ఇడియట్ల గురించి డైవర్ట్ కావద్దు. పక్కదారి పట్టద్దు. ఇప్పుడు కావాల్సింది సహనమే’’ అంటూ నిఖిల్ తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశాడు.

ఈ పోస్టులో ప్రస్తుతం పవన్ అభిమానుల అభిమానులతో పాటు నా ఎమోషన్ కూడా ఇలాగే ఉందంటూ నిఖిల్ తన సినిమాల్లోని కోపం.. కడుపుమంట.. పెదవి అంచున దాచుకున్న ఆగ్రహం.. ఇలా కొన్ని ఎక్స్ ప్రెషన్ల ఫొటోలు పెట్టాడు. పీకే ప్యాన్స్ ప్రస్తుతం ఇలా అంటూ దీనికి టైటిల్ పెట్టాడు.