Begin typing your search above and press return to search.

అమ్మాయిలూ.. కుర్ర హీరో పెళ్లికి రెడీ!

By:  Tupaki Desk   |   1 Dec 2015 11:30 AM GMT
అమ్మాయిలూ.. కుర్ర హీరో పెళ్లికి రెడీ!
X
ఇప్పటిదాకా ఎలాగోలా వాయిదా వేస్తూ వచ్చాను కానీ.. ఇప్పుడు మాత్రం తల్లిదండ్రుల మాట వినక తప్పని పరిస్థితి వచ్చేసిందంటున్నాడు యంగ్ హీరో నిఖిల్. స్వామిరారా - కార్తికేయ - సూర్య వెర్సస్ సూర్య లాంటి సినిమాలతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయిన నిఖిల్.. త్వరలోనే పెళ్లి చేసుకుంటాడట. త్వరలో అంటే ఏడాదికో రెండేళ్లకో కాదు.. 2016 వేసవి లోపు.. అంటే ఇంకో నాలుగైదు నెలల్లో తన పెళ్లయిపోతుందని చెబుతున్నాడు నిఖిల్. ఈ మేరకు తన తల్లిదండ్రులకు ప్రామిస్ చేసేశాడట.

కొన్నేళ్ల కిందట నిఖిల్ చెల్లెలి పెళ్లి కాగానే తన మ్యారేజ్ గురించి ఇంట్లో ప్రెజర్ మొదలైందని.. ఐతే వరుసగా రెండు సినిమాలు హిట్టయితే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చానని చెప్పాడు నిఖిల్. ఐతే రెండు సినిమాలు హిట్టయినప్పటికీ.. తనలో ఆశ పెరిగి ఇంకా ఎక్కువ హిట్లు కొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నానని చెప్పాడు. ఐతే ఇప్పుడు మాత్రం ఇంట్లో వాళ్ల పోరు ఎక్కువైందని.. అందుకే రాబోయే వేసవి లోపు పెళ్లి చేసుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నానని నిఖిల్ చెప్పాడు. కాబట్టి నిఖిల్ ను పెళ్లాడాలనుకునే అమ్మాయిలెవరైనా ఉంటే వెంటనే వెళ్లి వాళ్ల ఫ్యామిలీతో మాట్లాడేసుకోవచ్చు.