Begin typing your search above and press return to search.
సాయం చేయడానికి వచ్చిన వారిని ఎందుకు వద్దన్నాడు...?
By: Tupaki Desk | 1 May 2020 3:30 PM GMTప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా (కోవిడ్-19) పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలు పెరుగని పోరాటం చేస్తున్నాయి. సినీ ప్రముఖులందరూ తమ వంతు సాయంగా విరాళాలను ప్రకటిస్తున్నారు. టాలీవుడ్ యువ కథానాయకుడు నిఖిల్ కూడా సాయం అందించడానికి ముందుకు వచ్చాడు. కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలను కాపాడుతున్న వారిలో డాక్టర్స్, పారిశుద్ధ్య కార్మికులు ముందు వరుసలో ఉన్నారు. నిఖిల్ వారికి శానిటైజర్స్ ఇచ్చి తన మంచి మనసును చూపించుకున్నాడు. ఇంతకుముందు వారి కోసం నిఖిల్ రెసిపిరేటర్స్.. రీయూజబుల్ గ్లౌవ్స్.. ఐ ప్రొటెక్షన్ గ్లాసెస్.. శానిటైజర్స్.. మాస్కులను రెండు తెలుగు రాష్ట్రాల్లోని హాస్పిటల్స్ మరియు ఐసోలేషన్స్ వార్డ్స్‌లోని డాక్టర్స్ ఇతర సిబ్బందికి అందచేస్తున్నట్లు తెలియజేశాడు. అంతేకాకుండా ఆరోగ్య అధికారుల పర్యవేక్షణలో గాంధీ ఆసుపత్రికి వెళ్లిన నిఖిల్ స్వయంగా వ్యక్తిగత సంరక్షక పరికరాల్ని వైద్యులకు అందించారు. నిరుపేదలకు ఇళ్ళకి తిరిగి వారికి బియ్యం, కూరగాయలు వంటి కనీస అవసరాలను అందించాడు. ఈ సంక్షోభ సమయంలో సహాయం చేయడానికి ముందుకొచ్చిన నిఖిల్ ని అందరూ అభినందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నిఖిల్ చేస్తున్న మంచి పనికి ఒక అభిమాని సోషల్ మీడియా వేదికగా తన వంతుగా సహాయం చేయడానికి కొంత డబ్బులు పంపిస్తా అని ట్వీట్ చేసాడు. దీనికి నిఖిల్ రిప్లై ఇస్తూ... 'నువ్వు ఏమీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు బ్రదర్.. నిజంగా కష్టాల్లో ఉన్నవాళ్ళు ఉంటే నాకు ఇన్ఫామ్ చేయి.. మేము వాళ్లకోసం ఏదైనా చేస్తాం' అని చెప్పారు. సాయం చేయడానికి ముందుకు వచ్చిన వాడిని వద్దు అంటున్నాడు అంటూ నెటీజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే నిఖిల్ అలా చెప్పడానికి రెండు కారణాలు ఉండి ఉండొచ్చు. అతను ఏ ఛారిటీని నడపడం లేదు.. లేదా అతని దగ్గర సహాయం చేయడానికి సరిపడా అమౌంట్ ఉండి ఉండొచ్చు అని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా నిఖిల్ అలాంటి వారి సపోర్ట్ కూడా తీసుకుంటే ఆయన సహాయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఇదిలా ఉండగా నిఖిల్ ప్రస్తుతం 'కార్తికేయ 2' '18 పేజెస్' సినిమాలలో నటిస్తున్నారు. ఇటీవలే నిఖిల్ నిశ్చితార్థం జరిగింది. భీమవరంకు చెందిన వైద్యురాలు పల్లవిని ఆయన వివాహం చేసుకోనున్నారు. ఏప్రిల్ 16న వివాహం జరగాల్సి ఉండగా కరోనా వ్యాప్తి వల్ల పెళ్లి వాయిదా పడింది.