Begin typing your search above and press return to search.
హీరో రిజెక్ట్ చేశాడు... కానీ చిరు మెచ్చాడు
By: Tupaki Desk | 30 Dec 2017 12:30 PM GMTటాలీవుడ్ లో ఒక హీరో ఎంట్రీ పై గత కొంత కాలంగా చాలా రూమర్స్ వస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు మెగా స్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్. సాధారణంగా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఎంట్రీ ఇస్తున్నారు అంటే.. అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. మెగా ఫ్యాన్స్ హంగామా కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే అల్లుడి ఎంట్రీ మాత్రం చాలా సింపుల్ గా ఉండాలని మెగాస్టార్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే కథకు మెగా స్టార్ గ్రీన్ సిగ్నల్ లభించింది. దర్శకుడు రాకేష్ శశి కూడా ఫిక్స్ అయ్యాడు. నిర్మాత సాయి కొర్రపాటి సినిమాను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ ఎంట్రీతో కళ్యాణ్ ఎంతవరకు హిట్ కొడతాడో తెలియదు గాని అతను ఎంచుకున్న కథ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా కథ తండ్రి కొడుకుల మధ్య సాగుతుందట. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడుకున్న కథ అని సమాచారం. అలాగే రొమాంటిక్ లవ్ సీన్స్ కూడా ఉంటాయట. దర్శకుడు రాకేష్ శశి ఇంతకుముందు జతకలిసే అనే సినిమాను చేసి ఫెయిల్యూర్ ని అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఫాథర్ సన్ రిలేషన్ ని తనదైన శైలిలో అందంగా చూపించి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.
అయితే ఈ కథను మొదట నిఖిల్ తో తెరకెక్కించాలని అనుకున్నాడట. సాయి కొర్రపాటి కూడా అందుకు ప్లాన్స్ వేసుకున్నారు. కానీ నిఖిలో కథ వినగానే తనకు ఈ సెంటిమెంట్ సినిమా సెట్ అవ్వదని చెప్పి నో చెప్పాడట. కానీ కళ్యాణ్ మాత్రం వినగానే ఒకే చెప్పడంతో చిరుకి వినిపించి దర్శకుడు శబాష్ అనిపించుకున్నాడు. మరి మెగాస్టార్ మెచ్చిన కథ అంటే మ్యాటర్ ఉండే ఉంటుంది. మరి కళ్యాణ్ ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.