Begin typing your search above and press return to search.

ప్రొడ్యూసర్ డైరెక్షనా.. అంతా అబద్ధం

By:  Tupaki Desk   |   8 March 2018 2:30 AM GMT
ప్రొడ్యూసర్ డైరెక్షనా.. అంతా అబద్ధం
X
‘కిరాక్ పార్టీ’ సినిమా కోసం చాలామంది దర్శకులు చేశారు. ఈ చిత్రంతో శరణ్ కొప్పిశెట్టి అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతుండగా.. దీనికి నిఖిల్ మిత్రులైన చందూ మొండేటి.. సుధీర్ వర్మ రచనా సహకారం అందించారు. ఇక ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర కూడా స్వయంగా ఒక దర్శకుడే. ఆయన ‘యాక్షన్ త్రీడీ’ అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఐతే ‘కిరాక్ పార్టీ’కి ఇంతమంది పని చేసినప్పటికీ.. అనిల్ సుంకర డైరెక్షన్లో జోక్యం చేసుకున్నాడని.. కొంత వరకు సినిమాను తనే తీశాడని ఒక ప్రచారం జరిగింది. దీన్ని హీరో నిఖిల్ ఖండించాడు. ఈ సినిమా విషయంలో నిర్మాత అస్సలు జోక్యం చేసుకోలేదని నిఖిల్ స్పష్టం చేశాడు.

నిర్మాత అనిల్ ఈ చిత్ర ప్రారంభోత్సవం రోజు.. ఆ తర్వాత గుమ్మడికాయ కొట్టే రోజు తప్ప ఇంకెప్పుడూ సెట్స్‌ కు రాలేదని నిఖిల్ చెప్పాడు. ఇక ‘కిరాక్ పార్టీ’కి.. దీని కన్నడ ఒరిజినల్ ‘కిరిక్ పార్టీ’కి పోలికల గురించి నిఖిల్ మాట్లాడుతూ.. ‘‘ఒరిజినల్ నిడివి 2 గంటల 45 నిమిషాల దాకా ఉంటుంది. మేం 2 గంటల 25 నిమిషాలకు సినిమాను తగ్గించాం. ఐతే కథాకథనాల విషయంలో పెద్దగా మార్పులేమీ ఉండవు. సినిమా క్రిస్ప్ గా.. మరింత ఆకర్షణీయంగా తయారైంది’’ అని నిఖిల్ చెప్పాడు. సుధీర్ వర్మ.. చందూ మొండేటిలకు వేరే కమిట్మెంట్లు ఉన్నప్పటికీ తన కోసం ఈ సినిమాకు సహకారం అందించారని నిఖిల్ చెప్పాడు. ఈ సినిమాలోని తాను చేసిన స్టూటెండ్ లీడర్ పాత్ర.. తన కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్ అని నిఖిల్ చెప్పడం విశేషం.