Begin typing your search above and press return to search.

పెళ్లి గురించి థాంక్స్ చెప్పిన నిఖిల్

By:  Tupaki Desk   |   26 Feb 2018 2:24 AM GMT
పెళ్లి గురించి థాంక్స్ చెప్పిన నిఖిల్
X
కిరాక్ పార్టీతో వచ్చే నెల మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో పలకరించనున్న నిఖిల్ దాని విజయం పట్ల చాల నమ్మకంగా ఉన్నాడు. కారణం అది కన్నడలో ఇప్పటికే ప్రూవ్ అయిన బ్లాక్ బస్టర్ కావడమే. దానికి తోడు ఈ మధ్య కాలంలో యూత్ ని మెప్పించే సినిమాలు అందులోనూ పూర్తి కాలేజీ బ్యాక్ డ్రాప్ వచ్చినవి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది తప్పకుండా అలరిస్తుంది అనే నమ్మకం అందరిలోనూ వ్యక్తం అవుతోంది . ఇక షూటింగ్ పూర్తయ్యింది కాబట్టి మీడియాకు అందుబాటులోకి వచ్చిన నిఖిల్ ఒక న్యూస్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంగతులు షేర్ చేసుకున్నాడు. అందులో పర్శనల్ వి కూడా ఉన్నాయి లేండి.

గతంలో తేజస్విని అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగి పెళ్లి దాకా వచ్చి ఆగిపోయిందని నిఖిల్ గురించి కొన్ని మీడియా ఛానల్స్ లో ప్రచారం జరిగింది. కాని నిఖిల్ ఆ టైంలోనే అదేమి లేదని కొట్టిపారేశాడు. మరోసారి ఆ ఇంటర్వ్యూలో వచ్చిన పెళ్లి ప్రస్తావన గురించి వచ్చినప్పుడు తనకు ఆల్రెడీ మూడు సార్లు పెళ్లి చేసారని, ఆ పుణ్యమంతా మీడియాకే దక్కుతుందని వాళ్ళకు థాంక్స్ అంటూ కౌంటర్ వేసాడు. సరదాగా అన్నప్పటికీ నిఖిల్ అన్నదాంట్లో నిజం లేకపోలేదు. ఆధారాలు లేని వార్తలను చెక్ చేసుకోకుండా గుడ్డిగా ప్రసారం చేయటం అనేది ఈ మధ్య యు ట్యూబ్ ఛానల్స్ ఎక్కువయ్యాక బాగా పెరిగింది . ఈ నేపధ్యంలోనే నిఖిల్ మీద అలాంటి కథనాలు వడ్డించేసారు. తన పెళ్లి ఎప్పుడు ఫిక్స్ అయినా అందరిని పిలిచి చెప్పి చేసుకుంటానని, అంత దాకా అనవసర ప్రచారాలకు అవకాశం కల్పించకండి అని రిక్వెస్ట్ చేసాడు.