Begin typing your search above and press return to search.
ఓవర్సీస్ లో నిఖిల్ హంగామా
By: Tupaki Desk | 3 Dec 2015 9:30 AM GMTసినిమా సినిమాకీ తన స్థాయిని పెంచుకొన్న కథానాయకుడు నిఖిల్. స్వామి రారా - కార్తికేయ - సూర్య వర్సెస్ సూర్య... ఇలా వరుసగా విజయాల్ని సొంతం చేసుకొన్నాడు. మరికొన్ని గంటల్లోనే శంకరాభరణం విడుదల కాబోతోంది. ఈ సినిమాతోనూ సక్సెస్ కొట్టి డబుల్ హ్యాట్రిక్ పై కన్నేయాలన్న ఆలోచనలో ఉన్నాడు. నాలుగోసారి కూడా సక్సెస్సే అందితే కథానాయకుడిగా నిఖిల్ స్టార్ లీగ్ కి వెళ్లడం ఖాయం. ఇప్పటికే నిఖిల్ సినిమాలకి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. శంకరాభరణం సెట్స్‌పై ఉండగానే ఓవర్సీస్ బిజినెస్ అయిపోయింది. ఇదివరకు నిఖిల్ కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా శంకరాభరణం ఓవర్సీస్ లో భారీ స్థాయిలో విడుదలవుతోంది.
ఒక్క అమెరికాలోనే దాదాపు 80 థియేటర్లలో సినిమాని విడుదల చేస్తున్నారట. అలాగే గల్ఫ్ కంట్రీలతో పాటు, స్పెయిన్ - కెనడా... ఇలా దాదాపు ఎనిమిది దేశాల్లో సినిమా విడుదలవుతోందట. సినిమా ఎలా ఉన్నా సరే... ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయవడం ఖాయంగా కనిపిస్తోంది. శంకరాభరణం అన్న టైటిల్ అందరికీ చేరువైంది. సినిమాకి కూడా పాజిటివ్ బజ్జే ఉంది. కోన వెంకట్ పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర కథానాయకుడితో సినిమా వేడుకల్ని నిర్వహించి పకడ్బందీగా ప్రమోట్ చేశాడు. సినిమా హిట్ టాక్ సొంతం చేసుకొన్న వెంటనే నిఖిల్ తోపాటు నందిత - అంజలితో కలిసి కోన అమెరికాలో ప్రమోషన్ కార్యక్రమాల్ని నిర్వహించాలనుకుంటున్నాడట. ఒక రకంగా ఇది నిఖిల్ కెరీర్ కి చాలా కీలకమైన సినిమానే అని చెప్పొచ్చు.