Begin typing your search above and press return to search.

చిన్నవాడా.. ఫ్రస్టేటెడ్ జనాలకు అంకితం

By:  Tupaki Desk   |   24 Nov 2016 11:30 AM GMT
చిన్నవాడా.. ఫ్రస్టేటెడ్ జనాలకు అంకితం
X
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జనాలు సినిమాలు చూసే మూడ్ లో లేని టైంలో వచ్చింది ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’. ఇలాంటి రిస్కీ టైంలో సినిమాను రిలీజ్ చేయడంపై చాలామంది వారించారు. రిజల్ట్ ఎలా ఉంటుందో అని సందేహించారు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో హీరో నిఖిల్ సైతం.. కొంచెం భయంగా ఉందని మొహమాటం లేకుండా చెప్పేశాడు. కానీ ఈ సినిమా అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది. సినిమా బాగుంటే తమ దగ్గరున్న విలువైన డబ్బును కూడా జనాలు ఖర్చు చేస్తారని రుజువు చేసింది ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’. ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో నిఖిల్ మాట్లాడుతూ.. ఈ చిత్రం ఫ్రస్టేటెడ్ తెలుగు ఆడియన్స్ కు అంకితం అని చెప్పడం విశేషం.

‘‘ఎంతో ధైర్యం చేసి మా నిర్మాతలు ఈ సినిమాను రిలీజ్ చేశారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుకొచ్చారు. వాళ్లకు హ్యాట్సాఫ్. రిలీజ్ విషయంలో మేం చేస్తున్నది కరెక్టా.. రాంగా అనుకున్నాం. చాలా భయపడ్డాం. అయినా ధైర్యంగా రిలీజ్ చేశాం. తొలి షో నుంచి అద్భుతమైన టాక్ వచ్చింది. ఫస్ట్ వీకెండ్లోనే 11 కోట్ల గ్రాస్ అన్నది మైండ్ బ్లోయింగ్. నా కెరీర్లోనే పెద్ద హిట్లలో ఇది ఒకటి. వీక్ డేస్ లో కూడా హౌస్ ఫుల్స్ అంటే చాలా క్రేజీగా ఉంది. అమెరికాలో కూడా సినిమా అద్భుతంగా ఆడుతోంది. 500.. 1000 నోట్ల రద్దుతో జనాలు విపరీతంగా ఫ్రస్టేట్ అవుతున్న టైంలో మా సినిమా వచ్చింది. వాళ్లకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. అందుకే ఈ సినిమాను ఫ్రస్టేట్ అయిన తెలుగు జనాలందరికీ అంకితం చేస్తున్నాం’’ అని నిఖిల్ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/