Begin typing your search above and press return to search.
సైన్స్ సెంటిమెంట్ బాగానే పనిచేస్తోంది
By: Tupaki Desk | 21 Nov 2016 3:30 PM GMTఒక్కో హీరోకు ఒక్కో కథ అచ్చొస్తుంది. ఒక్కోసారి కొందరు వరుసగా మాస్ సినిమాలో హిట్లు కొడితే.. కొందరికి ఫ్యామిలీ సినిమాలు మాంచి ఫలితాలను ఇస్తాయి. ఈ మధ్యన అయితే కొందరికి హారర్ సినిమాలూ కొందరికి కామెడీ థ్రిల్లరు ఫలిస్తున్నాయి. ఇప్పుడు హీరో నిఖిల్ కూడా అలాగే ఒక పర్టిక్యులర్ రకమైన కథలతో దున్నేస్తున్నాడు.
గుండ్రంగా తిరిగే భూమికి వాస్తు ఏంటి సార్ అంటూ హీరో నిఖిల్ ''కార్తికేయ'' సినిమాలో ప్రశ్నిస్తాడు. అలాగే.. అసలు సైన్స్ఉన్న రోజులు ఆత్మలు ఏంటి అంటూ ''ఎక్కడికి పోతావు చిన్నవాడా'' సినిమాలో ప్రశ్నిస్తాడు. ఇలా రెండు సినిమాల్లోనూ శక్తులకు సైన్స్ తో సమాధానం చెబుతాడు. కాని చివరకు శక్తులకు కూడా జోహార్ అంటాడులే. కట్ చేస్తే ఈ రెండు సినిమాలకూ సేమ్ రిజల్ట్. రెండూ కూడా పెద్ద హిట్లు అనిపంచుకుంటున్నాయి. చూస్తుంటే తనకు సైన్స్ సెంటిమెంట్ అచ్చొచ్చినట్లు లేదూ? రోజు రోజుకూ కలక్షన్లు పెరగడమే కాని.. తగ్గడం అనేదే ''ఎక్కడికి పోతావు చిన్నవాడా'' సినిమాలో కనిపించట్లేదు. దీనిబట్టి ఈ సినిమా నిఖిల్ కెరియర్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సుంది.
అయితే ఈ సైన్స్ సెంటిమెంట్ నిఖిల్ కు ఉన్నా లేకపోయినా కూడా.. నిఖిల్ కోసం కథలు రాసేవారు మాత్రం ఇలాంటి కథలనే ఇప్పుడు తెగ వండేస్తున్నారట. జాగ్రత్త సామీ.. వండిన కథలనే వండకండి.. ఎట్లీస్ట్ కొందరు హీరోలైనా కొత్త కథలను ఈ మధ్యనే బయటకు తెస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/