Begin typing your search above and press return to search.

50 లక్షలు పెట్టాడు.. 5 కోట్లు గ్యారెంటీ!

By:  Tupaki Desk   |   24 Nov 2016 5:30 PM GMT
50 లక్షలు పెట్టాడు.. 5 కోట్లు గ్యారెంటీ!
X
తెలుగు సినిమాల ఓవర్సీస్ మార్కెట్ చాలా భిన్నం. అక్కడ కొందరు స్టార్ల సినిమాల్ని జనాలు అస్సలు పట్టించుకోరు. కానీ పెద్దగా పేరున్న హీరోలు లేకపోయినా సరే.. తమ టేస్టుకు నప్పే సినిమాలకు మాత్రం బ్రహ్మరథం పడుతుంటారు. కొన్ని నెలల కిందట ‘పెళ్లిచూపులు’ సినిమా ఇలాగే మ్యాజిక్ చేసింది. పెద్దగా అంచనాల్లేకుండా రిలీజై.. మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టింది. గత శుక్రవారం రిలీజైన నిఖిల్ మూవీ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ కూడా అదే స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తోంది ఓవర్సీస్‌ లో. ఈ సినిమా మీద బయ్యర్ పెట్టిన పెట్టుబడి రూ.50 లక్షలు. మామూలుగా నిఖిల్ మార్కెట్ ప్రకారం చూస్తే అది కూడా పెద్ద మొత్తమే. దీనికి తోడు పబ్లిసిటీ.. ఇతర ఖర్చులకు పది లక్షల దాకా ఖర్చయింది.

ఇప్పుడీ సినిమా జోరు చూస్తుంటే రూ.5 కోట్ల గ్రాస్ వసూలు చేసేలా కనిపిస్తోంది. ఫస్ట్ వీకెండ్లోనే ఈ సినిమా 4 లక్షల డాలర్ల దాకా వసూలు చేసింది. ఈ శుక్రవారం విడుదలవుతున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’కు అమెరికాలో పెద్ద హైప్ లేదు. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’నే లీడర్‌ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీకెండ్ తర్వాత కూడా అక్కడ కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. కాబట్టి డిసెంబరు 9న ‘ధృవ’ వచ్చే వరకు ఈ చిత్రానికి ఢోకా ఉండకపోవచ్చు. కాబట్టి ఫుల్ రన్లో అనూహ్యమైన కలెక్షన్లను ఖాతాలో వేసుకునేలా కనిపిస్తోందీ చిత్రం. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘కార్తికేయ’ను ఈ చిత్రం బీట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/