Begin typing your search above and press return to search.

రియ‌ల్ గ‌న్స్ తో షూట‌ర్ లా మారిన యంగ్ హీరో

By:  Tupaki Desk   |   21 Feb 2022 12:01 AM GMT
రియ‌ల్ గ‌న్స్ తో షూట‌ర్ లా మారిన యంగ్ హీరో
X
సిల్వ‌స్ట‌ర్ స్టాలోన్ న‌టించిన `ఫ‌స్ట్ బ్ల‌డ్` ఎంతటి సంచ‌ల‌న‌మో తెలిసిందే. మెషీన్ గ‌న్స్ తో స్టాలోన్ ఆప‌రేష‌న్ మాస్ ని ఒక రేంజులో అల‌రించింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌స్ట్ బ్ల‌డ్ బంప‌ర్ హిట్టయ్యింది ఆరోజుల్లో.

ఆ త‌ర్వాత అదే స్ఫూర్తితో బాలీవుడ్ లో మ‌రో స్టాలోన్ లా మారాడు టైగ‌ర్ ష్రాఫ్. అత‌డు ఫ‌స్ట్ బ్ల‌డ్ త‌ర‌హా సినిమాలో న‌టించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నాడు.

ఇక‌పోతే ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ మేకోవ‌ర్ ని చూస్తే నిజంగానే ర్యాంబో .. ఫ‌స్ట్ బ్ల‌డ్ చిత్రాల స్ఫూర్తి క‌నిపిస్తోంది. స్టాలోన్ త‌ర‌హాలోనే అత‌డి బాడీలోనూ మేకోవ‌ర్ స్ప‌ష్ఠంగా లైవ్ లీగా ఉంది. అతడు ఇప్పుడు కండలు మెలితిప్పి తీరైన దేహంతో మెరిపిస్తున్నాడు. బైసెప్.. ట్రైసెప్.. షోల్డ‌ర్ లైన‌ప్ ప్ర‌తిదీ మారిపోయాయి.

నిఖిల్ మునుప‌టితో పోలిస్తే ర‌గ్గ్ డ్ గా క‌నిపిస్తున్నాడు. పైగా ఇలా భారీ రియ‌ల్ గ‌న్ ఎక్కుపెట్టి క‌నిపించేస‌రికి ఫ‌స్ట్ బ్ల‌డ్ ఆప‌రేష‌న్ కి వెళుతున్నాడ‌న్న సిగ్న‌ల్ అందింది ఫ్యాన్స్ కి. ఇంత‌కీ ఈ ఆప‌రేష‌న్ దేనికోసం? అన్న‌ది నిఖిల్ చెప్పాల్సి ఉంటుంది.

నిఖిల్ కెరీర్ మొట్టమొదటి యాక్షన్ థ్రిల్లర్ ని ట్రై చేస్తున్నాడు. ఎడిటర్ గ్యారీ హెచ్ తో యంగ్ హీరో నిఖిల్ తదుపరి చిత్రం నిర్మాణం ప్రారంభ దశలో ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ పూర్త‌యింది. ఇందులో నిఖిల్ గూఢచారిగా నటిస్తున్నాడు.

ఇటీవ‌ల నిఖిల్ లైవ్ వెపన్ ట్రైనింగ్ తీసుకున్నాడు. వచ్చే నెలలో మనాలిలో హై ఆక్టేన్ యాక్షన్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా నిఖిల్ లైవ్ వెపన్ ట్రైనింగ్ గురించి వెల్లడిస్తూ నిజమైన గన్ ని గురి పెడుతున్న చిత్రాన్ని పోస్ట్ చేశాడు. ``లైవ్ వెపన్స్ ట్రైనింగ్... గారీతో ఒక అడ్రినలిన్ పంపింగ్ ప్రాజెక్ట్ కోసం`` అని నిఖిల్ క్యాప్షన్ ఇచ్చాడు. ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.