Begin typing your search above and press return to search.

దర్శకులిద్దరు సెట్స్ లో ఉండాల్సిందే

By:  Tupaki Desk   |   10 Sept 2017 3:35 PM IST
దర్శకులిద్దరు సెట్స్ లో ఉండాల్సిందే
X
కెరీర్ మొదట్లో కాస్త తప్పటడుగులు వేసినా ప్రతి హీరో ఎన్నో అనుభవాలను అలవాటు చేసుకొని ఆ తర్వాత హిట్ కథలను పసిగట్టి సినిమాగా తీసి మంచి హిట్ అందుకుంటారు. ఇప్పుడు అదే తరహాలో యువ హీరో నిఖిల్ కూడా మెల్ల మెల్లగా తనకంటూ ఓ మార్కెట్ ను స్థాయిని పెంచుకుంటూ వస్తున్నాడు. మంచి కథలతో వస్తే కొత్త దర్శకులనైనా సరే ఏ మాత్రం ఆలోచించకుండా వారికి ఛాన్సులను ఇస్తున్నాడు.

చివరగా కేశవ సినిమాతో మంచి హిట్ అందుకున్న నిఖిల్ మరో సారి ఒక వినూత్న కథతో రాబోతున్నాడు. కన్నడ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన "కిరిక్ పార్టీ" క్యాంపస్ కామెడీ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. అయితే ఎన్నో ఏళ్లుగా తనకు తెలిసిన శరన్ కోప్పిసెట్టి అనే యువకున్ని దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడు నిఖిల్. ఈ సినిమా కోసం ఇప్పటికే ఓ కాలేజ్ ను అద్దెకు కూడా తీసుకుందట. త్వరలోనే 100 మంది విద్యార్థులతో అక్కడ షూటింగ్ చేయిస్తారట.

అయితే శరన్ కొత్త దర్శకుడు కావడంతో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను సుధీర్ వర్మ-చందు మొండేటి పర్యవేక్షణలో చెయ్యాలని డిసైడ్ అయ్యాడట నిఖిల్. అలాగే వారు కథలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఎందుకంటే వారితో నిఖిల్ కి ప్రత్యేక అనుబంధం ఉంది. ఇంతకుముందు తన సినిమాలకు కూడా వారు పనిచేశారు. దీంతో వారిని సినిమాకి సపోర్ట్ గా ఉండమన్నాడాట నిఖిల్. పైగా ఈ సీన్లన్నీ తీసేటప్పుడు లొకేషన్లో ఉండాల్సిందేఅ ని పట్టుబడుతున్నాడట. మరి వారి అనుభవం సినిమాకి ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.