Begin typing your search above and press return to search.
నిఖిల్ కి శేఖర్ కమ్ముల షాకింగ్ కండీషన్?
By: Tupaki Desk | 17 Sep 2020 11:50 AM GMTవిభిన్నమైన కథల్ని ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని దక్కించుకున్నారు హీరో నిఖిల్. మాస్ తో పాటు క్లాస్ ఆడియన్స్ ని కూడా ఒకేసారి తన చిత్రాలతో మెప్పిస్తూ యంగ్ హీరోల్లో క్రేజీ హీరోగా దూసుకుపోతున్నారు. `హ్యాపీడేస్` హీరోల్లో చాలా వరకు తెరమరుగయినా తనదైన ఎనర్జీ ఇన్నోవేషన్ తో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వరుస హిట్ లను సొంతం చేసుకుంటున్నాడీ యంగ్ టాలెంటెడ్ హీరో. ఇటీవల మహమ్మారీ గ్యాప్ తో షూటింగులు బంద్ అయ్యాయి. లాక్ డౌన్ సమయంలో ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడి అందరినీ ఆశ్చర్య పరిచాడు.
ప్రస్తుతం `కార్తికేయ 2`లో నటిస్తున్న నిఖిల్ ఆలీతో సరదాగా` కార్యక్రమంలో తన హ్యాపీడేస్ నాటి సంగతుల్ని పంచుకున్నాడు. `హ్యాపీడేస్`లో అవకాశం ఎలా వచ్చింది? అని అడిగితే.. రాజేష్ క్యారెక్టర్ కోసం సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల నిఖిల్ కు ఓ కండిషన్ పెట్టారట. `హ్యాపీడేస్`లో రాజేష్ క్యారెక్టర్ కోసం లక్ష 20 వేల మంది అప్లికేషన్లు వచ్చాయని... అందులోంచి తనని సెలెక్ట్ చేసిన శేఖర్ కమ్ముల తన కంటే ఎవరు బాగా చేసినా తనని తీసేసి వారిని పెట్టేస్తానన్నారని అసలు సీక్రెట్ బయటపెట్టాడు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో వున్న ఓ హీరో కూడా ఆ పాత్ర కోసం పోటీ పడ్డాడని.. బోర్డ్ పై తన ఫొటో కింద అతని ఫొటోని కూడా పెట్టారని.. సెట్లోకి కొత్తగా ఎవరొచ్చినా భయపడేవాడినని నిఖిల్ చెప్పుకొచ్చాడు. భయం భయంగానే ఆ సినిమా పూర్తి చేశాడట. ఇక్కడ నిలబడాలంటే కాన్పిడెంట్ ముఖ్యమన్న విషయం అర్థమైందని చెప్పాడు నిఖిల్. ఇండస్ట్రీలో తాను ఎవరికైనా రుణపడి వున్నానంటే అది శేఖర్ కమ్ములకు మాత్రమేనని స్పష్టం చేశాడు.