Begin typing your search above and press return to search.
లుక్కుతో లక్కీ ఛాన్సులు కొట్టేస్తోంది
By: Tupaki Desk | 15 Feb 2018 7:01 AM GMTసోషల్ మీడియా వల్ల క్రేజ్ పెరుగుతుందని మరొక ఉదహరణ రీసెంట్ గా బయటపడింది. వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా లలో చాలా వైరల్ అవుతోన్న ప్రియ ప్రకాష్ వారియర్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. కళ్లతో అసలైన రొమాన్స్ అంటే ఏంటో చూపించిన ఈ బ్యూటీ గురించి ఇప్పుడు చాలా మంది చర్చించుకుంటున్నారు. ఏకంగా స్టార్ హీరోలకే ఆ ముద్దు గుమ్మ హావభావాలు నచ్చాయి అంటే ఏ రేంజ్ లో క్రేజ్ అందుకుంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఇలాంటి బ్యూటీలు ఇంటర్నెట్ లో వైరల్ అయితే మన సినిమావాళ్లు అస్సలు ఊరుకోరు. వెంటనే అడ్రస్ పట్టుకొని డేట్స్ ఆడిగేస్తారు. ప్రస్తుతం అమ్మడికి టాలీవుడ్ నుంచి ఆఫర్స్ చాలా అందుతున్నాయట. చేసింది కొన్ని సినిమాలే ఇప్పుడు ఓరు ఆధార్ లవ్ అనే సినిమా రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. దానికి సంబంధించిన వీడియోలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే అందరికంటే ముందు ప్రియా ప్రకాశ్ ని నిఖిల్ తన నెక్స్ట్ సినిమా కోసం సెట్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది. కాని ఇంకా ఫైనల్ కాలేదు. ఎందుకంటే ఆ హీరోయిన్ తరుపున ఆమె డేట్లను చూస్తున్న ఆమె తొలి సినిమా దర్శకుడు ఒమర్ లులు.. ఏకంగా 2 కోట్లు ఇస్తేనే ఈమె హీరోయిన్ గా చేస్తోంది అంటూ ఏవేవో చెబుతున్నాడు.
ఇకపోతే నిఖిల్ త్వరలో పెళ్లి చూపులు దర్శకుడితో ఒక సినిమా చేయాలని డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ అయితే కరెక్ట్ గా కథానాయిక క్యారెక్టర్ కి సెట్ అవుతుందని ఫిక్స్ అయ్యారట. అలాగే మరికొంత మెగా హీరోలు కూడా ఈ పిల్లను హీరోయిన్ గా తీసుకురావాలని చూస్తున్నారు. ఒక్క లుక్కుతో లక్కీ ఛాన్సులు పట్టడం అంటే ఇదేనేమో కాని మనోళ్లు ఇలా కలవరించడం పెద్ద వింత కాదులే. అదే క్రేజ్ మహిమ. కాకపోతే ఇలా రెండు కోట్లు మూడు కోట్లు కావాలి అంటే మాత్రం క్రేజ్ అంతా కర్పూర హారతి అయిపోతుందని ప్రియ గ్రహించాల్సిందే.