Begin typing your search above and press return to search.

మేడ మీద మోహన్ బాబు కూతురి కబుర్లు

By:  Tupaki Desk   |   3 Sep 2017 9:35 AM GMT
మేడ మీద మోహన్ బాబు కూతురి కబుర్లు
X
టాలీవుడ్ తెరపైకి మలయాళీ భామల దాడి ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాప్ హీరోల సినిమాల్లో లీడ్ హీరోయిన్ ఆఫర్స్ ను కూడా పట్టేస్తున్నారు మలయాళ సినిమా ముద్దుగుమ్మలు. ఇప్పుడు నిఖిలా విమల్ అనే భామ కూడా తెలుగులో సత్తా చాటేందుకు సిద్ధమైపోయింది.

అల్లరి నరేష్ హీరోగా రూపొందిన మేడ మీద అబ్బాయి చిత్రంలో నటించింది నిఖిలా విమల్. తన పాత్ర తీరుతో పాటు బోలెడన్ని కబుర్లు చెప్పింది ఈ భామ. "సింధు అనే అమ్మాయి పాత్రలో నేను నటించాను. ఆమె జీవితంలో చోటు చేసుకున్న పరిస్థితులో ఈ చిత్రం. మలయాళ రీమేక్ అయినా.. అదే దర్శకుడు తెరకెక్కించినా.. మంజిమా మోహన్ చేసిన రోల్ కు ప్రజిత్ నన్ను ఎంచుకున్నారు. ఆ ఛాయలు కనిపించకుండా నా స్టైల్ లోనే చేశాను. మొత్తం ఫ్యామిలీకి నచ్చే సినిమాగా ఉంటుంది" అని చెబుతోంది నిఖిలా విమల్. ప్రస్తుతం ఈ చిన్నది మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ సినిమాలో నటిస్తోండగా.. అందులో విలక్షణ నటుడికి కూతురుగా యాక్ట్ చేస్తోంది.

గ్లామర్ విషయంలో తనకు అభ్యంతరాలు లేవంటున్న నిఖిలా విమల్.. గ్లామర్ ప్లస్ యాక్టింగ్ రెండూ సమపాళ్లలో ఉండాలని చెబుతోంది. గంతలో తెలుగు సినిమాలు చూడకపోయినా.. ఇప్పుడు అవతలి వాళ్లు మాట్లుడుతుంటే బాగానే అర్ధమవుతోందట. త్వరలో మాట్లాడేయడం కూడా మొదలుపెట్టేస్తానంటోంది మీడ మీద అబ్బాయికి హీరోయిన్ అయిన నిఖిలా విమల్.