Begin typing your search above and press return to search.
పదేళ్లు అయినా పవన్ పేరును తీసేయడం లేదు
By: Tupaki Desk | 4 March 2020 7:30 AM GMT‘కొమురం పులి’ చిత్రంలో పవన్ కళ్యాణ్ కు జోడీగా నటించిన ముద్దుగుమ్మ నికిషా పటేల్. ఈ అమ్మడు కెరీర్ ఆరంభం నుండి ఎదురు దెబ్బలు తింటూనే ఉంది. మొదటి సినిమాను దారుణమైన పరాజయం పాలయ్యింది. పవన్ కళ్యాణ్ తో పరిచయం అవ్వడంతో ఈ అమ్మడు ఓ రేంజ్ కు వెళ్లి పోతుందని అంతా భావించారు. కాని ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం.. ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో ఈమెను జనాలు మర్చి పోయే పరిస్థితి వచ్చింది.
తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈమె పలు సినిమాలు చేసింది. ఈ పదేళ్ల కెరీర్ లో దాదాపుగా పాతిక సినిమాలు చేసినా కూడా ఏ ఒక్కటి కూడా అబ్బ అనిపించే రేంజ్ లో సక్సెస్ కాలేదు.. అలా అని ఈమెకు గుర్తింపును తీసుకు రాలేక పోయాయి. మొత్తానికి ఈ అమ్మడికి అన్ని విధాలుగా తీవ్ర స్థాయిలో నిరాశే మిగిలింది. పైగా పదేళ్లు అయినా కూడా ఈమెను ఇంకా కూడా పవన్ కళ్యాణ్ హీరోయిన్ అంటూనే పిలుస్తున్నారట.
సినిమాల్లో ఛాన్స్ లు లేక పోవడంతో లండన్ వెళ్లిపోయిన ఈ అమ్మడు తాజాగా ఒక ఆన్ లైన్ మీడియా సంస్థతో మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం తాను నటనలో శిక్షణ తీసుకుంటున్నట్లుగా చెప్పింది. ఇకపై తనను మంచి నటిగా చూస్తారు అంది. తెలుగు మరియు తమిళ చిత్రాలు బోర్ కొట్టించాయి. ఎన్నో మంచి తమిళ చిత్రాల్లో నటించినా కూడా నన్ను ఇంకా చాలా మంది పవన్ కళ్యాణ్ హీరోయిన్ గానే చూస్తున్నారు.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ అంటున్నారంటూ ఒకింత అసహనం వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ తో కెరీర్ ను ఆరంభించకుండా ఉండి ఉంటే తన కెరీర్ మరోలా ఉండేదేమో అంటూ నికిషా అభిప్రాయం వ్యక్తం చేసింది.