Begin typing your search above and press return to search.

మహేష్‌ చెల్లెలు ఈవిడే గురూ

By:  Tupaki Desk   |   3 Aug 2015 12:09 PM IST
మహేష్‌ చెల్లెలు ఈవిడే గురూ
X
కొన్ని సందర్భాలు చాలా అరుదైనవి. ఇప్పుడున్న షూటింగులన్నీ వెరైటీ. పాత రోజుల్లో అయితే ఆన్‌ సెట్స్‌ వెళ్లాక నటీనటులంతా ఓ కుటుంబ సభ్యుల్లా కలిసిపోయి ఒకరికొకరు ఆప్యాయంగా పలకరింపులు, కలిసి వనభోజనాల్లా లంచి కార్యక్రమం పూర్తి చేయడాలు ఉండేవి. కానీ ఇప్పుడు అంతా టెక్నాలజీ యుగం. అసలు షూటింగులో ఎవరు పాల్గొంటున్నారో.. ఆ సీన్‌ లో ఎంతమంది నటీనటులు ఉన్నారో కూడా పక్కవాడిని అడిగితే చెప్పలేని పరిస్థితి.

అందుకేనేమో ! ఫలానా సినిమాలో నాకు మహేష్‌ అన్నయ్యగా నటించాడు.. అని అతడికి సోదరిగా నటించిన క్యారెక్టర్‌ ఆర్టిస్టు చెప్పుకోవాల్సిన దుస్థితి. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఈ అమ్మడికి ఎదురైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు చిత్రంలో మహేష్‌ కి సోదరిగా నటించింది నికిత అనీల్‌ కుమార్‌. ఈ అమ్మడికి మహేష్‌ తో కలిసి నటించే సన్నివేశాలు ఉన్నా.. ఇంతవరకూ ఒక్కసారి కూడా మనసు విప్పి ప్రిన్స్‌ తో మాట్లాడలేకపోయానని చెప్పింది. హాయ్‌! హెలో .. అంటూ పలకరించుకోవడం ... ఎవరి పని వాళ్లు పూర్తి చేసి పలాయనం చిత్తగించడం.. అంతవరకే. మహేష్‌ పక్కా ప్రొఫెషనల్‌. అతడికి తన పని తప్ప వేరే ధ్యాసే ఉండదు. సెట్‌ లో సుత్తి వేయడాలు అసలే ఉండవు. అందుకే పాపం నికిత కి అలాంటి డిఫరెంట్‌ అనుభవం ఎదురైంది.

ఈ భామ బోయ్‌ మీట్స్‌ ది గర్ల్‌ - తొలి ప్రేమకథ చిత్రంలో కథానాయిక. తమిళ్‌ లో రెండు సినిమాల్లో నాయికగా నటించింది. అవి రిలీజ్‌కి రావాల్సి ఉందింకా.