Begin typing your search above and press return to search.

మ‌గువల్లో న్యూన‌త త‌గ‌ద‌ని క్లాస్ తీస్కున్న బ్యూటీ

By:  Tupaki Desk   |   17 Oct 2020 9:50 AM GMT
మ‌గువల్లో న్యూన‌త త‌గ‌ద‌ని క్లాస్ తీస్కున్న బ్యూటీ
X
గ్లామ‌ర్ రంగంలో అందానికి ఉండే ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల రంగం స‌హా సినీ టీవీ రంగంలో ప‌ని చేసేవాళ్ల‌కు అందం ఆరోగ్యంపై శ్ర‌ద్ధ త‌ప్ప‌నిస‌రి. అయితే చాలా మంది త‌మ‌లోని లోపాల గురించి మ‌ద‌న‌ప‌డిపోతూ నిత్యం బాధ‌కు గుర‌వుతుంటారు. అలాంటి వారికి స‌రైన క్లాస్ తీస్కుంది సోష‌ల్ యాక్టివిస్ట్ కం మోడ‌ల్ కం న‌టి నిఖిత శ‌ర్మ‌. 2015 నుంచి 2020 మ‌ధ్య త‌న‌లోని మార్పును ఆవిష్క‌రించే ఫోటోల్ని షేర్ చేసిన శ‌ర్మా గాళ్. ఇటీవ‌ల త‌న‌లో మేకోవ‌ర్ గురించి న‌డుము చుట్టూ కొలెస్ట‌రాల్ కంట్రోల్ గురించి మ‌చ్చ‌ల‌తో కాంతి విహీన‌మైన శ‌రీరం నుంచి కాపాడుకోవ‌డం గురించి మాట్లాడింది. ఒక ర‌కంగా మ‌గువ‌ల‌ లైఫ్ స్టైల్ గురించి ఈ బ్యూటీ విత్ బ్రెయిన్ క్లాస్ తీస్కుంద‌నే చెప్పాలి.

ఇంత‌కీ నిఖిత అందం కాపాడుకోవ‌డంపై ఏం టిప్స్ చెప్పింది అంటే... ``నా శరీరాన్ని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నా. ఇది ప్రతిరోజూ నాకు చాలా చేస్తుంది. ప్రతి రోజు మారుతుంది. రోజు రోజుకి మరింత అందంగా ... నేను ఒంటిపై మచ్చలతో నా జీవితంలో ఇప్పటివరకు చేసిన యుద్ధాలు ఎన్నో. కానీ అన్నిటినీ జ‌యించ‌ను`` అంటూ క‌వితాత్మ‌కంగా చెప్పుకొచ్చింది నిఖితా శ‌ర్మ‌.

``నేను ఇంతకాలం నన్ను నేను ప్రేమించలేదు. అంగీకరించలేదు. ఇది నిజమైన హింస. నేను నివసించిన ఊపిరి పీల్చుకున్న ప్రతి రోజు, ... నేను నిరంతరం నా శరీరాన్ని వేరొకరితో పోల్చి నన్ను శపించుకుంటాను. మనలో ప్రతి ఒక్కరూ ఒకే ఆహారాన్ని తిని..., అదే విధంగా వ్యాయామం చేసినా,.. మనకు ఇంకా భిన్నమైన శరీరాలు ఉంటాయనేది నాకు ఉన్న అతి పెద్ద పరిపూర్ణత`` అని అంది.

ఇలాంటి సమస్యలతో పోరాడుతున్న ఇతర మహిళలకు నా సందేశం ఏమిటంటే? మీరు ప్రపంచం అనే క‌న్ను నుండి మిమ్మల్ని చూస్తూ తీర్పు ఇచ్చుకోవ‌డం మానేసి,.. మీ సొంత‌ కళ్ళ ద్వారా మాత్రమే మిమ్మల్ని చూడటం ప్రారంభించాలి. మీరు నిజంగా ఏమిటో మీరే చూడండి. ప్రతి ఉదయం మేల్కొలపడానికి అద్దంలో మిమ్మల్ని మీరు చూడటం అలవాటు చేసుకోండి. ప్రతి అందమైన ఒంపుల్ని.. పగుళ్లను “లోపం” గా తీర్పు చెప్పే బదులు..., మీరే గట్టిగా కౌగిలించుకోండి`` అంటూ పోయెట్రీ చెప్పింది నిఖిత‌.