Begin typing your search above and press return to search.

వెండితెరపై ఆయన జీవితం

By:  Tupaki Desk   |   5 Oct 2017 6:14 AM GMT
వెండితెరపై ఆయన జీవితం
X
బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ బాగానే నడుస్తోంది. దంగల్ ఘన విజయం తర్వాత అందరికీ బయో పిక్ లపై నమ్మకం బాగా పెరిగింది. అందుకే ఆయా రంగాల్లో సక్సెస్ ఫుల్ పర్సన్ల జీవిత విశేషాలను వెండితెరపై చూపించడానికి డైరెక్టర్లు ఉవ్విళ్లూరుతున్నారు. స్పోర్ట్ పర్సన్ల జీవిత గాథలతో భాగ్ మిల్కా భాగ్ - మేరీ కోమ్ - ఎం.ఎస్.ధోని - సచిన్ వంటి సినిమాలొచ్చాయి. ఇవి కాక ఎయిర్ హోస్టెస్ కథతో నీర్జా.. కువైట్ లోని బిజినెస్ మేన్ కథతో ఎయిర్ లిఫ్ట్... కొండను తొలిచిన వ్యక్తి కథతో మాంఝీ సినిమాలొచ్చాయి.

ఇప్పుడు లేటెస్ట్ గా అంతరిక్ష రంగంలో రాణించిన ఇస్రో మాజీ ఛైర్మన్‌ కె.రాధాకృష్ణన్‌ జీవిత గాథ సినిమాగా రానుంది. రాధాకృష్ణన్‌ ఓ చిన్నపల్లెటూరి నుంచి స్పేస్ రీసెర్చ్ లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. తాను ఈ స్థాయికి ఎదగడం వెనుక ఎంతో పోరాటం ఉందని ఆయన చెప్పారు. తన జీవిత నేపథ్యం తెలియజేసే లక్ష్యంతో మై ఒడిస్సీ అనే పుస్తకం కూడా రాశారు. ఈ పుస్తకం ఆధారంగానే బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ అద్వానీ ఓ సినిమా తీయబోతున్నాడు. మన దేశ ప్రధాని మోదీ మంగళ్‌ యాన్‌ మిషన్‌ బృందంతో కలిసి దిగిన ఫొటోను చూసినప్పుడు నిఖిల్‌ కు రాధాకృష్ణన్‌ గురించి సినిమా తీస్తే ఎలాగుంటుందన్న ఐడియా వచ్చిందట. ఆయన రాసిన పుస్తకం చదివాక సినిమా తీసేందుకు రెడీ అయ్యాడు.

నిఖిల్ అద్వానీ బాలీవుడ్ లో సినిమాలు తీయడంతో పాటు ప్రొడ్యూస్ కూడా చేస్తుంటాడు. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన బయోపిక్ ఫిలిం ఎయిర్ లిఫ్ట్ సినిమాకూ ఆయనే ప్రొడ్యూసర్. లేటెస్ట్ గా ఫర్హాన్ అఖ్తర్ - డయానా పెంటీ జంటగా లక్నో సెంట్రల్ సినిమా మరో ముగ్గురితో కలిసి నిర్మించాడు. డైరెక్టర్ గా ఈమధ్య పెద్దగా హిట్లేవీ ఆయన ఖాతాలో లేవు. అందుకే ఈ బయోపిక్ తో హిట్ కొట్టాలని ఆశ పడుతున్నాడు.