Begin typing your search above and press return to search.

ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సౌత్ హీరోయిన్..!

By:  Tupaki Desk   |   19 Nov 2022 10:30 AM GMT
ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సౌత్ హీరోయిన్..!
X
వర్సటైల్ హీరో ఆది పినిశెట్టి మరియు హీరోయిన్ నిక్కీ గల్రానీ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే స్టార్ కపుల్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

నిక్కీ గల్రాని ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని.. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోందంటూ నెట్టింట వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆది దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని రూమర్స్ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో.. తాజాగా నిక్కీ స్పందించింది.

తాను గర్భవతి అంటూ వస్తున్న వార్తలను సోషల్ మీడియా వేదికగా నిక్కీ ఖండించింది. ఈ బిగ్ న్యూస్ గురించి నాకు కూడా తెలియదు. నేను ప్రెగ్నెంట్ అంటూ కొందరు నా తరపున వైరల్ అనౌన్స్ మెంట్ చేస్తున్నారు. ప్లీజ్.. నాకు ఆ డెలివరీ డేట్ తెలుసుకోవాలనుంది' అంటూ స్మైలీ ఎమోజీని పోస్ట్ చేసింది.

"నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కాదు. భవిష్యత్తులో అయితే ఈ అమేజింగ్ న్యూస్ ని నేనే ఫస్ట్ తెలియజేస్తా. దయజేసి రూమర్లను ప్రచారం చేయకండి" అంటూ నిక్కీ గల్రాని తన నోట్ ద్వారా రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది.

కాగా, నిక్కీ గల్రానీ - ఆది పినిశెట్టి దాదాపు రెండేళ్ల ప్రేమాయణం తర్వాత పెద్దల అంగీకారంతో వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి నెలలో ఎంగేజ్మెంట్ చేసుకుని.. మే 18న పెళ్లి చేసుకున్నారు.

ఆది - నిక్కీ గల్రాని గతంలో 'యాగవరాయినుం నా కాక్క’ అనే తమిళ సినిమాలో కలిసి నటించారు. ఇది తెలుగులో ‘మలుపు’ పేరుతో విడుదలైంది. అలానే 'మరకతమణి' సినిమాలోనూ జంటగా నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారిందని తెలుస్తోంది.

అయితే సీక్రెట్ గా డేటింగ్ చేసిన ఈ జంట.. వారి రిలేషన్ షిప్ గురించి ఎప్పుడూ బయటకు చెప్పలేదు. అయితే నిక్కీ - ఆది మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి ఒక ఇంటివారయ్యారు. ఇకపోతే వీరిద్దరూ ఇప్పుడు "శివుడు" అనే తెలుగు సినిమాలో కలిసి నటిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.