Begin typing your search above and press return to search.

కొత్త పదాలను కనిపెట్టడంలో బిజీగా మంచు ఫ్యామిలీ

By:  Tupaki Desk   |   17 Dec 2018 3:45 PM GMT
కొత్త పదాలను కనిపెట్టడంలో బిజీగా మంచు ఫ్యామిలీ
X
లెజెండరీ యాక్టర్ ప్రొడ్యూసర్ మంచు మోహన్ బాబు ఈమధ్య సినిమాలు చేయడం తగ్గించారు గానీ అయన సోషల్ మీడియాకు ఎప్పుడూ ప్రియమైన వ్యక్తి. కొన్ని నెలల క్రితం మోహన్ బాబు.. అయన ముద్దుల కుమార్తె మంచు లక్ష్మి కలిసి రాజ్ దీప్ సర్ దేశాయి ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఇంగ్లీష్ ఇంటర్వ్యూ కావడంతో ఒక చోట సరైన పదం దొరక్క మోహన్ బాబు 'ఫసాక్' అన్నారు.

ఇంకేముంది.. సోషల్ మీడియాలో అల్లకల్లోలం జరిగింది. ట్రోల్స్.. మీమ్స్ కుప్పలు తెప్పలుగా వచ్చాయి. తెలుగు భాషా సంపదకు 'ఫసాక్' అనే కొత్త పదం తోడైనందుకు భాషామానులు కూడా సంబరపడ్డారు. ఆ 'ఫసాక్' అనే టైటిల్ ను మంచు విష్ణు ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించాడు. ఇదిలా ఉంటే మంచు లక్ష్మి తాజాగా మీడియాతో మాట్లాడుతూ 'నిలదీస్ఫై' అనే పద ప్రయోగం చేసింది. ఇలాంటి పదం తెలుగు శబ్దకోశంలో ఎక్కడా లేకపోవడంతో అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురై మంచువారిని కీర్తిస్తున్నారు.

నెటిజనులు ఎప్పుడూ ఇలాంటి కొత్త పదాలను గుర్తించడంలో ముందుంటారు. దీంతో మీమ్స్.. ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఏదేమైనా ఈ 'నిలదీస్ఫై' ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగు వారికి చాలా కావలిసిన పదం అయిపోయింది. త్వరలో ఎవరైనా ఈ పేరుతో ఫిలిం ఛాంబర్ లో టైటిల్ కూడా రిజిస్టార్ చేస్తారేమో వేచి చూడాలి.