Begin typing your search above and press return to search.
వాళ్లిద్దరి మధ్య ఏమీ లేదంట..ఇద్దరూ చెప్పేశారు
By: Tupaki Desk | 4 Sep 2018 8:14 AM GMTరెండు రోజులుగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి వార్తల్లోకి వచ్చేశారు. సోషల్ మీడియాలోనూ ఆయనపై అటెన్షన్ పెరిగిపోయింది. వయసులో ఉన్నప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడిగా అతగాడి క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి రవిశాస్త్రికి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి పెళ్లి బ్రేకప్ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నారు. ఇది కూడా సక్రమంగా లేదన్న మాటతో పాటు.. తన కంటే 20 ఏళ్ల చిన్నదైన బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ తో డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
అది కూడా చాలా రోజులుగా సాగుతుందని.. అందుకే కొన్ని కార్యక్రమాలు వారిద్దరూ వస్తుంటారని..తమ మధ్య ఉన్న అనుబంధంపై ఎవరికి అనుమానం రాకుండా ఉండేలా ప్లాన్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారన్న వార్త ఒక్కసారిగా సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే.. తాజాగా తమపై వచ్చిన వార్తల మీద రవిశాస్త్రి.. నిమ్రత్ కౌర్ రియాక్ట్ అయ్యారు. తమ మధ్య ఏమీ లేదని తేల్చేశారు. ఇలా అంటే పెద్దగా నమ్మరని అనుకున్నారో ఏమో కానీ.. రవిశాస్త్రి కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆ వార్తల మీద స్పందించాల్సిన అవసరం ఏముందంటూ.. అవి ఆవుపేడతో సమానంగా ఆయన కొట్టిపారేశారు
రవిశాస్త్రి ఇంత సీరియస్ గా రియాక్ట్ అయితే.. నిమ్రత్ కౌర్ మాత్రం కాస్తంత ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. తాను రైట్ కెనాల్ చేయించుకోవాలేమోనన్న ఆమె.. తాను చదివినదేదీ నిజం కాదన్నారు. కాకుంటే.. తమిద్దరి మీద రాసిన వార్తలు తనను బాధించినట్లుగా వెల్లడించారు తనకు ఐస్ క్రీం అంటే ఇష్టమని చెప్పటం ద్వారా రవిశాస్త్రితో ఎలాంటి రిలేషన్ లేదన్న మాటను చెప్పే ప్రయత్నం చేశారు. మరి.. ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత అయినా వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.