Begin typing your search above and press return to search.
ఆ హీరోయిన్ గ్రేట్ కదండీ..
By: Tupaki Desk | 14 Feb 2016 7:30 PM GMTహీరోయిన్లను చూస్తే సామాన్య జనాలకు ఓ చులకన భావం ఉంటుంది. డబ్బు కోసం అందాలు ఆరబోస్తారని.. విచ్చలవిడి జీవితాన్ని గడుపుతారని.. విలాసవంతమైన జీవితం కోసమే సినిమాలు చేస్తారని.. అనుకుంటారు జనాలు. ఐతే అందరి విషయంలోనూ ఇది నిజం కాదు. కొందరి నేపథ్యం భిన్నంగా ఉంటుంది. వారి వెనక విషాదకరమైన గతం కూడా ఉంటుంది. బాలీవుడ్ హీరోయిన్ నిమ్రత్ కౌర్ కూడా అలాంటి అమ్మాయే. లేటు వయసులో తెరంగేట్రం చేసిన ఈ టాలెంటెడ్ హీరోయిన్.. తప్పనిసరి పరిస్థితుల్లో, తన కుటుంబ భారాన్ని మోయడానికే సినిమాల్లో అడుగుపెట్టింది.
ఆర్మీలో పనిచేసిన నిమ్రత్ తండ్రి 2002లో కశ్మీర్ లో జరిగిన ఓ ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి నుంచి కుటుంబ భారాన్ని తన భుజస్కంధాలపై వేసుకుంది నిమ్రత్. ముందు మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. క్యాడ్బరీస్ డెయిరీ మిల్క్ లాంటి యాడ్స్ తో పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి ‘లంచ్ బాక్స్’ లాంటి వైవిధ్యమైన సినిమాతో మంచి పేరు సంపాదించింది. ఇటీవలే ‘ఎయిర్ లిఫ్ట్’ మూవీతో మరో మెట్టు ఎక్కింది.
సినిమాల్లో సంపాదించిన డబ్బుతో తనకంటే చిన్నదైన చెల్లెలి పెళ్లి కూడా చేసింది నిమ్రత్. మొన్న శుక్రవారం ఢిల్లీలో తన చెల్లి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించి తల్లి కళ్లు చెమర్చేలా చేసింది నిమ్రత్. వచ్చే నెలలో ఆమె 34వ పడిలోకి అడుగుపెడుతుండటం విశేషం. నిజానికిది పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వాళ్ల బాగోగులు చూసే వయసు. కానీ ఆమె మాత్రం కుటుంబానికే అంకితమైపోయింది. ఇంతకీ నీ పెళ్లి ఎపుడు అంటుంటే.. ఇంకా తన బాధ్యతలు పూర్తిగా తీరిపోలేదని.. అవన్నీ పూర్తయ్యాక పెళ్లాడతానని అంటోంది నిమ్రత్. ఆమె కమిట్మెంట్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే కదూ.