Begin typing your search above and press return to search.
నింగి చుట్టే టీజర్: జేసుదాసునే తలపించేలా..
By: Tupaki Desk | 7 March 2020 10:50 AM GMTజేసుదాసు స్వరం ఒకసారి వింటే మళ్లీ మళ్లీ వినాల్సిందే. అదో అడిక్షన్ లాంటిదని అభిమానులు అంటుంటారు. ఆ స్వరంలోని యూనిక్ నెస్.. ఎక్స్ క్లూజివిటీ ఇప్పటివరకూ వేరొక గాయకుడు ఎవరికీ సాధ్యం కాలేదు. అందుకే ఇన్నేళ్లు అయినా.. ఎందరో గాయకులు వచ్చినా కానీ ఆయన స్థానం చెక్కు చెదరదు. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు సినిమా తీసారంటే అందులో జేసుదాసు స్వరం వినిపించాల్సిందే. ఆయనకు అంత అడిక్షన్ ఆ గొంతు.
ఇకపోతే జేసుదాసు వారసుడు విజయ్ ఏసుదాసు సౌత్ లో అంతే ఫేమస్ సింగర్ గా ఎదిగారు. అచ్చం తండ్రి మూసలో పోసిన స్వరమా ఇది అన్నంతగా అతడి గొంతులో ఆ గాంభీర్యం మైమరిపిస్తుంది. ఇదిగో ఇప్పుడు అలాంటి ఓ క్లాసిక్ సాంగ్ ని పాడారు. బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా రూపొందిస్తున్న `ఉమామేశ్వర ఉగ్ర రూపశ్య` చిత్రంలో `నింగి చుట్టే మేఘం` అంటూ సాగే గీతాన్ని విజయ్ ఏసుదాసు ఆలపించారు. ఇక ఈ పాటకు బిజిబాల్ ట్యూన్ అంతే అందంగా కుదిరింది.
ఒక అందమైన పల్లెటూరు.. ఆ పల్లె జనం పచ్చందం చుట్టూ తిరిగే కథాంశాన్ని ఎంచుకుని కేరాఫ్ కంచరపాలెం ఫేం వెంకటేష్ మహా మరో అందమైన సినిమాని అందిస్తున్నాడని ఈ విజువల్స్ చెబుతున్నాయి. అరకు అందాల్ని ఈ పాట టీజర్ లో అద్భుతంగా క్యాప్చుర్ చేశారు. విలేజ్ నేపథ్యం.. దాంతో పాటే పల్లె మనుషుల భావోద్వేగాలను కెమెరాలో అందంగా బంధించారు. తొలి ప్రయత్నమే కేరాఫ్ కంచరపాలెం చిత్రంతో జాతీయ అవార్డును తన ఖాతాలో వేసుకున్న వెంకటేష్ మహా.. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడని ఈ విజువల్స్ చెబుతున్నాయి. ఓ విలేజ్ ఫోటోగ్రాఫర్ ఉమా మహేశ్వర చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. సత్యదేవ్ ఆ పాత్రలో ఒదిగిపోయి కనిపించాడు. ఇక కల్ట్ క్లాసిక్ జోనర్ లోనే మరోసారి వెంకటేష్ మహా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని అర్థమవుతోంది.