Begin typing your search above and press return to search.
ఎమోషనల్ కథతో 20 కోట్లు వస్తాయా?
By: Tupaki Desk | 6 July 2017 9:54 AM GMTఒక్క సినిమా ఒక రేంజులో హిట్టయిదనుకోండి.. వెంటనే ఆ హీరో తదుపరి సినిమాలు కూడా అదే రేంజులో అమ్మేయడం జరుగుతుంది. అదే నిర్మాతల స్ర్టాటజీ. కాని ఆ మార్కెట్ అస్తమానం అంతే రేంజులో తెస్తుందని గ్యారంటీ మాత్రం లేదు. ఇదిగో ఇప్పుడు నాని హీరోగా వస్తున్న ''నిన్ను కోరి'' పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ చూస్తే.. కాస్త షాకవ్వాల్సిందే.
భలే భలే మగాడివోయ్ సినిమా 25+ కోట్లు షేర్ తెచ్చాక.. దాదాపుగా నాని సినిమాలన్నీ అదే రేంజులో అమ్మేయాలని చూస్తున్నారు. ఇప్పుడు నిన్ను కోరి సినిమాను కూడా ఏకంగా 20 కోట్లకు విక్రయించారట. నైజాంలో ఐదున్నర కోట్లు పలికిన ఈ సినిమా.. గోదావరి జిల్లాల్లో రమారమీ 1 కోటి వరకు అందుకుంది. సీడెడ్లో 2 కోట్లు దాటిన బిజినెస్.. కర్ణాటకలో 1.2 కోట్లు.. ఓవరస్సీస్ లో ఏకంగా 3.5 కోట్ల బిజినెస్ జరిపింది. మొత్తానికి కేవలం ధియేట్రికల్ రైట్స్ ను 20+ కోట్లకు విక్రయించారు. అంటే సినిమా ఏకంగా 40 కోట్లు గ్రాస్ వసూలు చేయాలి. అసలే ఒక ఎమోషనల్ కథ.. పైగా ఒకమ్మాయితో ఇద్దరు అబ్బాయిలు అనేది అంతగా అస్తమానం సక్సెస్ అయ్యే కాన్సెప్టు కాదు. అలాంటప్పుడు అంతేసి ఇన్వెస్టుమెంట్ తేలికగా వసూలు అవుతుందా?
బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఓకె కాని.. యావరేజ్ లేదా ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం కొన్ని ఏరియాల్లో పెద్దగా వర్కవుట్ కాదంటున్నారు ట్రేడ్ పండితులు. కాకపోతే నిర్మాతలకు మాత్రం ఖచ్చితంగా పెట్టినదానికంటే రెండింతలు ప్రాఫిట్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది.