Begin typing your search above and press return to search.
నిప్పురా.. అందుకే తీసేశారా?
By: Tupaki Desk | 21 July 2016 3:30 PM GMT'నిప్పురా'.. ఈ ఒక్క పదం వినగానే.. సూపర్ స్టార్ రజినీకాంత్ కళ్ల ముందు మెదులుతున్నాడంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంతగా జనాలను ఆకట్టుకుంది కబాలిలోని ఈ పాట. ధీమ్ మ్యూజిక్ నుంచి లిరిక్ వరకూ.. వాయిస్ నుంచి రజినీకాంత్ ఎనర్జీ వరకూ ఏ యాంగిల్ లో అయినా.. నిప్పురా పాట జనాలను కట్టిపడేసింది.
అసలు ఏ మాత్రం అంచనాలు లేని సమయంలో.. కేవలం ఒకే ఒక టీజర్.. సాంగ్ ప్రోమో.. సినిమాకి ఎంత హైప్ కావాలో అంతా తీసుకొచ్చేశాయి. ఇప్పుడీ థీమ్ సాంగ్ ని సినిమాలోంచి తీసేశారనే న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఐపాడ్స్ లో.. ఎఫ్ ఎంలలో.. ఎక్కడ విన్నా సరే అదరగొట్టేస్తున్న ఈ పాటను సినిమాలోంచి తొలగించడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే మధ్యలో వచ్చే ఈ పాటను తొలిగించక తప్పలేదని.. రెండున్నర గంటలకు సినిమాని కుదించేందుకు గాను.. ఎడిటింగ్ లో తీసేశారని తెలుస్తోంది.
కానీ అభిమానులు ఫీలవుకుండా ఉండేందుకు గాను.. ఆఖరిలో టైటిల్ క్రెడిట్స్ తో పాటు ఈ సాంగ్ ని ప్లే చేస్తారట. ఏమైనా నిప్పురా లాంటి సెన్సేషనల్ సాంగ్ ని తీసేయాలని నిర్ణయించడమంటే.. అదో డేరింగ్ డెసిషన్ అనాల్సిందే.