Begin typing your search above and press return to search.

ట్రైలర్‌ టాక్‌: ఇదే నిర్మలా కాన్వెంట్‌

By:  Tupaki Desk   |   2 July 2016 3:24 PM GMT
ట్రైలర్‌ టాక్‌: ఇదే నిర్మలా కాన్వెంట్‌
X
మరి ఏ క్లాస్ చదువుతున్నారో తెలియదు కాని.. ఒక కుర్రాడు శామ్యూల్‌ (రోషన్‌) అలాగే ఒక చిన్నది శాంతి (శ్రీయ శర్మ) ప్రేమలో పడ్డారు. వారి స్కూల్‌ హెడ్‌ నాగార్జున వారి ప్రేమ ఏ మలుపు తిరుగుతుందా అని చూస్తున్నారు. ఇంతలో ఎలాగో వారి పెద్దలు అడ్డుపడ్డారు. అప్పుడు ఆ ప్రేమ కథ ఏ మలుపు తిరుగుతుంది అనేదే ''నిర్మలా కాన్వెంట్''.

ఈరోజు సాయంత్రం స్వయంగా నాగార్జున ట్విట్టర్ లో విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌ నుండి ఆ కథను అర్ధంచేసుకోవచ్చు. హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హ్యండ్సమ్ గా ఉండగా.. హీరోయిన్‌ గా మారి చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీయ శర్మలో స్టార్‌ హీరోయిన్ అయ్యే కళ కనిపిస్తోంది. చూడ్డానికి విజువల్స్ చాలా ఫ్రెష్‌ గా ఉన్నాయి. కాకపోతే స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్ వంటి సినిమా బ్యాక్ డ్రాప్‌ లో.. అల్లు అర్జున్ డెబ్యూ సినిమా గంగోత్రి చూస్తున్నామా అనే సందేహం ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే నిర్మలా కాన్వెంట్‌ కథ కూడా అచ్చం అలాగే ఉన్నట్లు అనిపిస్తోంది కాబట్టి. వెటరన్ మ్యూజిక్‌ డైరక్టర్ కోటి తనయుడు రోషన్ సాలూరి అందించిన మ్యూజిక్ బాగానే ఉంది.

చూద్దాం మరి.. ఒక ఫ్రెష్‌ లవ్ స్టోరీతో వస్తున్న దర్శకుడు జి.ఎన్.కె.రావు ఎంతవరకు ఇంప్రెస్ చేస్తాడో.