Begin typing your search above and press return to search.
అక్రమ సంబంధం పెట్టుకుని శారీరకంగా హింసించాడు
By: Tupaki Desk | 4 March 2022 2:30 AM GMTగత సంవత్సరం టీవీ నటి నిషా రావల్ మరియు బాలీవుడ్ నటుడు కరణ్ మెహ్రా లు విడి పోయారు. ఆసమయంలో చాలా పెద్ద రచ్చ జరిగింది. బాలీవుడ్ మీడియాతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా వీరి విషయమై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కరణ్ మెహ్రా మరియు పాయల్ రోహత్గీ ల మద్య ప్రేమ వ్యవహారం కారణంగానే నిషా రావల్ అతడి నుండి విడిపోయినట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.
తాజాగా మరోసారి ఆ విషయంపై నటి నిషా రావల్ స్పందించింది. కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న లాక్ అప్ అనే రియాల్టీ టాక్ షో లో భాగంగా నిషా రావల్ పలు విషయాలను వెళ్లడించింది. ఈ షో లో గత ఏడాది తన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి నిషా రావల్ చెప్పుకొచ్చింది. ఆ సమయంలో నిషా కన్నీటి పర్యంతం అయ్యింది. తాను అత్యంత దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చింది.
నిషా రావల్ మాట్లాడుతూ.. నేను పలు సందర్బాల్లో కరణ్ మరియు పాయల్ రోహత్గీ ఫోన్ లో మాట్లాడుకోవడం గమనించాను. ఇద్దరి మద్య అక్రమ సంబంధం విషయం నాకు అర్థం అయిన తర్వాత మానసికంగా శారీరకంగా కరణ్ హింసించడం మొదలు పెట్టాడు. పాయల్ తో అక్రమ సంబంధం గురించి ప్రశ్నించాననే ఉద్దేశ్యంతో తమ కుమారుడుని తీసుకుని కరణ్ ముంబై వెళ్లి పోయాడు. ఆ సమయంలో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.
పాయల్ తో ప్రేమ విషయం గురించి అడిగిన ప్రతిసారి కూడా అతడు చాలా వైల్డ్ గా ప్రవర్తించేవాడు. నేను మరొకరి ప్రేమలో ఉన్నాను. కొన్నాళ్లుగా మేము సీక్రెట్ గా రిలేషన్ షిప్ కంటిన్యూ చేస్తున్నాం. నేను ఆమెను ప్రేమిస్తున్నాను. అలాగే నిన్ను కూడా ఇష్టపడుతున్నాను. ఇద్దరి పై తనకు ప్రేమ ఉంది అన్నట్లుగా మాట్లాడేవాడు. అతడి మాటలు నాకు చాలా బాధను కలిగించేవి అంటూ నిషా రావల్ అన్నారు.
కరణ్ ను నమ్మి పెళ్లి చేసుకున్నాను. అతడితో పెళ్లికి సిద్దం అయిన సమయంలోనే కొందరు హెచ్చరించినా కూడా నమ్మకంతో ఆయన్ను పెళ్లి చేసుకున్నాను. కాని అతడి వల్ల నా జీవితం నాశనం అయ్యింది. అందుకే మళ్లీ మళ్లీ అతడిని నమ్మ కూడదు అనే ఉద్దేశ్యంతో మీడియా ముందుకు వచ్చాను.
ఆ సమయంలో చాలా మంది కెచప్ పెట్టుకుని కెమెరా ముందుకు వచ్చావని కూడా విమర్శించారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అతడి నుండి విడి పోయిన తర్వాత తన జీవితం సాఫీగా సాగుతుందని చెప్పుకొచ్చింది. శారీరకంగా మానసికంగా అతడు చాలా హింసించడం వల్లే విడాకుల వరకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.