Begin typing your search above and press return to search.

భీష్మ లవ్ స్టోరీ కాదా నితిన్ బ్రో..?!

By:  Tupaki Desk   |   28 Jan 2020 6:28 AM GMT
భీష్మ లవ్ స్టోరీ కాదా నితిన్ బ్రో..?!
X
యువ హీరో నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఫిబ్రవరి 21 న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కూడా ప్రారంభం అయ్యాయి. ఫస్ట్ లుక్ పోస్టర్లు... ఫస్ట్ టీజర్.. సింగిల్స్ అంథెమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమో మెటీరియల్ చూస్తూ ఉంటే సినిమా ఒక క్యూట్ లవ్ స్టోరీ.. ఒక స్వీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అనిపిస్తుంది. ఆయితే ఈ సినిమా గురించి తాజాగా ఒక షాకింగ్ ట్విస్ట్ బయట కు వచ్చింది.

ఈ సినిమా ఒక సందేశాత్మక చిత్రమట. మహేష్ బాబు 'మహర్షి' తరహాలో ఈ సినిమాలో వ్యవసాయం గురించి నితిన్ ప్రేక్షకుల మనసులకు హత్తుకునేలా వివరిస్తాడని టాక్ వినిపిస్తోంది. మహేష్ లాంటి పెద్ద స్టార్ హీరో అగ్రికల్చర్ గొప్పదనం వివరిస్తూ డైలాగ్స్ చెప్తేనే అది జనాలకు పెద్దగా రుచించలేదు.. మహేష్ అదేపనిగా క్లాసులు పీకుతున్నాడని రుస రుసలాడారు. అయితే సినిమా రిలీజ్ కు ముందు గానే రైతులకు సంబంధించిన ఎపిసోడ్ ఉందని ప్రచారం జరిగింది కాబట్టి ఆ సందేశాన్ని సభ్య సమాజం సహృదయంతో స్వీకరించగలిగింది. ఇప్పుడు రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రెజెంట్ చేస్తూ 'భీష్మ' సినిమా లో ఇలా రైతులకు సంబంధించిన సమస్యలు చర్చిస్తే ఆడియన్స్ ఎలా స్పందిస్తారో.. ఈ మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ నితిన్ కు వర్క్ అవుట్ అవుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఒకవేళ ప్రచారంలో ఉన్నరకంగా ఈ సినిమాలో రైతుల సమస్యలకు సంబంధించిన మెసేజ్ ఉంటే అది దాచిపెట్టకుండా ప్రేక్షకులను ముందే మానసికంగా సన్నద్ధం చేయడం మంచిదని లేకపోతే వారు సినిమా చూసిన తర్వాత షాక్ అవడం ఖాయమని అంటున్నారు. మరి 'భీష్మ' టీమ్ ఏం చేస్తారో వేచి చూడాలి.