Begin typing your search above and press return to search.
ఆ మాట రాకుండా మాస్ట్రో చేశాం
By: Tupaki Desk | 15 Sep 2021 6:47 AM GMTనితిన్ హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన మాస్ట్రో సినిమా ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది. ఈనెల 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వబోతున్న మాస్ట్రో సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులు మరియు పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ సందర్బంగా నితిన్ మాట్లాడుతూ సినిమాపై చాలా నమ్మకంను వ్యక్తం చేశాడు. ఈ సినిమా ప్రారంభించాలనుకున్న సమయంలో కాస్త టెన్షన్ పడ్డాము. అంధాదున్ చూసిన వెంటనే రీమేక్ చేయాలనుకున్నాను. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడం వల్ల తప్పకుండా చేయాలని అనిపించింది. కాని రీమేక్ అంటే చాలా రిస్క్ తో కూడుకున్న విషయం. ఇంతటి రిస్క్ ను తీసుకునే దర్శకుడు మేర్లపాక గాంధీ అనిపించింది. ఖచ్చితంగా అతడైతే ఈ ప్రాజెక్ట్ కు న్యాయం చేస్తాడు అనిపించి అతడిని సంప్రదించడం జరిగింది.
అంధాదున్ ను ఉన్నది ఉన్నట్లుగా దించేస్తే ఏం తీశాడు అంటారు... మార్చి చేస్తే మంచి సినిమా సోల్ లేదు చెడగొట్టేశారు అంటారు. కాని ఆ మాట రాకుండా దర్శకుడు మేర్లపాక గాంధీ చక్కగా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి స్క్రీన్ ప్లేను మార్చి సినిమాను తెరకెక్కించాడు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే ఈ కథ మరియు కథనం కొత్తగా ఉంటుందని నితిన్ చెప్పుకొచ్చాడు. హిందీలో ఈ సినిమా ఎంతగా సక్సెస్ అయ్యిందో.. ఎంతగా ప్రేక్షకులను ఎంతగా ఎంటర్ టైన్ చేసిందో అంతే ఇక్కడ కూడా సక్సెస్ అవుతుంది.. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందని పేర్కొన్నాడు. అంధాదున్ లో టబు పాత్ర కోసం ఇక్కడ చాలా మందిని సంప్రదించాం. తమన్నాను అడగాలని అనుకున్న సమయంలో ఆమె ఒప్పుకోదేమో అనే అనుమానం కలిగింది. కాని ఆమె పాత్ర నచ్చడంతో చేసేందుకు ఓకే చెప్పిందని నితిన్ పేర్కొన్నాడు.
ఇక సినిమాలో ఒక పాత్రకు సింగర్ మంగ్లీ అయితే బాగుంటుందని నాన్న అన్నారు. అయితే ఆమె నటిస్తుందనే నమ్మకం నాకు లేదు. ఆ పాత్రకు ఆమె న్యాయం చేస్తుందని కూడా నేను అనుకోలేదు. ఆమెను అడిగిన వెంటనే నటించేందుకు ఓకే చెప్పింది. ఆమె సన్నివేశాలు చిత్రీకరణ ముగిసిన తర్వాత తప్పకుండా మంగ్లీ ముందు ముందు మంచి నటిగా పేరు దక్కించుకుంటుందనే నమ్మకం కలిగిందని నితిన్ అన్నాడు. మంగ్లీకి సినిమాలో కీలక పాత్రను ఇవ్వడం జరిగిందట. సినిమా లో సీనియర్ తమన్నా.. హీరోయిన్ నభా నటేష్ ఇంకా మంగ్లీ కూడా ఉండటంతో ఫుల్ కలర్ ఫుల్ గా ఉంటుందేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా ను ఓటీటీ లో విడుదల చేయడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ విషయమై నితిన్ మాట్లాడుతూ మొదట నాకు కూడా బాధ కలిగింది. కాని తప్పని పరిస్థితుల్లో ఓటీటీకి ఇవ్వవలసి వచ్చిందని నితిన్ అన్నాడు. ఈ సినిమా లో నితిన్ అంధుడిగా కనిపించబోతున్నాడు.