Begin typing your search above and press return to search.

హీరో నితిన్ బర్త్ డే వేడుకల్లో మెరిసిన స్టార్ కపుల్..!

By:  Tupaki Desk   |   30 March 2021 12:27 PM GMT
హీరో నితిన్ బర్త్ డే వేడుకల్లో మెరిసిన స్టార్ కపుల్..!
X
టాలీవుడ్ హీరో నితిన్ గతేడాది భీష్మా సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ కోవిడ్ కారణంగా గతేడాది విడుదల కావాల్సిన సినిమాలన్ని ఈ ఏడాది ఒక్కొక్కటిగా గ్యాప్ లేకుండా విడుదల చేస్తున్నాడు నితిన్. తాజాగా అతని పుట్టినరోజు సందర్బంగా సోషల్ మీడియాలో నితిన్ పుట్టినరోజుకు సంబంధించిన ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. మార్చ్ 30న పుట్టినరోజుతో నితిన్ 38వ యేట అడుగుపెట్టాడు. అతి సన్నిహితుల మధ్య నితిన్ తన పుట్టినరోజు సెలెబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఐతే ఎన్నడూ లేనిది ఈసారి నితిన్ పుట్టినరోజుకు సింగర్ సునీత తన భర్త రామ్ తో హాజరుకావడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. కానీ వీరు హాజరు కావడానికి బలమైన కారణమే ఉందట.

ఇటీవలే రామ్ సునీత పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. అయితే వీరిద్దరి పెళ్లిలో నితిన్ పాత్ర చాలానే ఉందట. అందరికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ సునీత రామ్ ల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు దగ్గరుండి నితిన్ జరిపించిన విషయం ఎంతమందికి తెలుసు. అయితే పెళ్లికి ముందే రామ్ నితిన్ క్లోస్ అని తెలుస్తుంది. రామ్ ఓ యూట్యూబ్ మీడియాను రన్ చేస్తున్నాడట. ఆ విధంగా ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగిందని టాక్. ఇదిలా ఉండగా.. నితిన్ పుట్టినరోజును తన భార్య షాలిని దగ్గరుండి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది. ఆ సెలెబ్రేషన్స్ లో భాగంగా దిగిన సెల్ఫీలలో రామ్ సునీత ఇద్దరూ కనిపించడం సర్ప్రైజ్ గా అనిపిస్తుంది. మొత్తానికి సింగర్ సునీత ఫ్యామిలీ కూడా నితిన్ ఫ్యామిలీకి క్లోస్ అనే విషయం బయటపడింది. ఇక తాజాగా రంగ్ దే సినిమాతో హిట్ అందుకున్న నితిన్ త్వరలో మాస్ట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.