Begin typing your search above and press return to search.

అఖిల్.. నితిన్.. మధ్యలో సమంత

By:  Tupaki Desk   |   6 Nov 2015 5:09 PM GMT
అఖిల్.. నితిన్.. మధ్యలో సమంత
X
అఖిల్ - నితిన్ థిక్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. అఖిల్ తనే లాంఛ్ చేయాలని పట్టుబట్టి మరీ 'అఖిల్' మూవీ తీశాడు నితిన్. మరి వీళ్ల ఫ్రెండ్ షిప్ మధ్యలో వేరే అమ్మాయి దూరితే ఎలా ఉంటుంది ? అది కూడా సమంత లాంటి బ్యూటీ వస్తే.. వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుంది ? ఈ ప్రశ్నలకు ఇప్పుడు ఆన్సర్స్ దొరికేశాయి.

'హాయ్ అఖిల్ గారూ.. నేనంటే మీకెంత ప్రేమ' అని అడుగుతూ ట్వీట్ చేశాడు నితిన్. 'మాటల్లో చెప్పలేకపోతున్నాను నితిన్ గారూ' అంటూ ఆన్సర్ ఇచ్చాడు అఖిల్. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. మధ్యలో సమంత దూరిపోయింది. 'నితిన్.. నీకు ఇంతటి కెమిస్ట్రీ నాతో ఉంటే గనక.. మనం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతాం.. సై' అంటూ నితిన్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేసింది సమంత.

'షటప్ శామ్.. మా ఇద్దరి మధ్యలో విలన్ గా రాబోకు'అంటూ నితిన్ కంటిన్యూ చేయడంతో.. 'ఎక్స్ క్యూజ్ మీ.. నేను నిన్ను వదిలేయనా' అనడం హైలైట్ అయిపోయింది. ఇక నితిన్ ఏం చేయలేక 'నీకు కుళ్లు' అనేశాడు సమంంతని. 'వదిలెయ్ నితిన్.. మా శామ్ టైమింగ్ తో నువ్వు పోటీ పడలేవులే' అంటూ నితిన్ కి సూచించాడు అఖిల్. ఈ దెబ్బకు నితిన్ సైలెంట్ అవడంతో.. ఇద్దరికీ బెస్టాఫ్ లక్ చెబతూ సమంత కూడా క్లోజ్ చేసింది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య ఓ హీరోయిన్ ఎంటరయితే.. సీన్ ఇలా ఉంటుందన్న మాట.