Begin typing your search above and press return to search.

యంగ్‌ హీరోలు ఇద్దరు ఈ విషయంలోనూ పోటీ పడుతున్నారే

By:  Tupaki Desk   |   18 Feb 2020 12:30 AM GMT
యంగ్‌ హీరోలు ఇద్దరు ఈ విషయంలోనూ పోటీ పడుతున్నారే
X
కాకతాళీయమో లేదంటే కావాలని చేస్తున్నారో కాని టాలీవుడ్‌ యంగ్‌ హీరోలు నితిన్‌ మరియు నిఖిల్‌ లు ఒకే సారి పెళ్లి చేసుకునేందుకు సిద్దం అయ్యారు. గత కొన్ని రోజులుగా వీరి పెళ్లి వార్తలతో టాలీవుడ్‌ మీడియా దద్దరిల్లి పోతుంది. సోషల్‌ మీడియాలో వీరి పెళ్లి ముచ్చట్లు వీరి ప్రేమ సంగతులు చర్చించుకుంటున్నారు. వీరిద్దరిది కూడా ప్రేమ వివాహమే అవ్వడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. నితిన్‌ 8 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు.. నిఖిల్‌ 5 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు.

ఇద్దరు కూడా సుదీర్ఘ కాలపు ప్రేమను పెళ్లిగా మార్చుకునేందుకు సిద్దం అయ్యారు. వీరిద్దరి ప్రేమ విషయాల్లో ఇంకా పలు విషయాల్లో చాలా సిమిలారిటీస్‌ ఉన్నాయి. దాంతో వీరి పెళ్లి గురించి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో వీరి పెళ్లి తేదీకి సంబంధించిన విషయం కూడా చర్చనీయాంశం అయ్యింది. వీరిద్దరు కూడా ఒకే రోజున పెళ్లి చేసుకోబోతున్నారట. నితిన్‌ ఏప్రిల్‌ 16న దుబాయిలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెల్సిందే.

ఇటీవలే పెళ్లికి సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయి. ఇదే సమయంలో నిఖిల్‌ కుటుంబ సభ్యులు కూడా పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించారట. వారు కూడా ఏప్రిల్‌ 16నే నిఖిల్‌ వివాహం చేయాని భావిస్తున్నారట. వెన్యూ ఫిక్స్‌ అయిన తర్వాత పెళ్లి డేట్‌ పై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. నిఖిల్‌.. నితిన్‌ ఇద్దరు కూడా ఒకే రోజున పెళ్లి చేసుకోవడం ఖాయంగా అనిపిస్తుంది. బాక్సాపీస్‌ వద్ద యంగ్‌ హీరోలు పోటీ పడటం ఇప్పటి వరకు మనం చూశాం. కాని మొదటి సారి పెళ్లి విషయంలో ఒకే తేదీన వీరిద్దరు పోటీ పడి మరీ పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందనిపిస్తుంది.