Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ 'ఆ..ఆ' నేర్పేది ఎప్పుడంటే
By: Tupaki Desk | 6 Oct 2015 3:30 AM GMT2016 సంక్రాంతి సీజన్ మహా రంజుగా ఉంటుందని ముందే అర్ధమైపోయింది. వరుసగా పెద్ద హీరోలు, బడా డైరెక్టర్లు పొంగల్ పై కన్నేయడంతో.. సినిమా యుద్ధం తప్పదనే భావించారు అందరూ. ఆ సీజన్ కి షెడ్యూల్ చేసిన సినిమాలు లిస్ట్ చూస్తే వామ్మో అనిపించక మానదు. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, బాలకృష్ణ 99వ సినిమా డిక్టేటర్, ఎన్టీఆర్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న నాన్నకు ప్రేమతో, సమంత-నితిన్ లతో త్రివిక్రమ్ తీస్తున్న అ.. ఆ.. ఇవన్నీ సంక్రాంతినే టార్గెట్ చేశాయి ఇన్నాళ్లూ. కానీ పోటీ పడి పోగొట్టుకోవడం కంటే.. సెపరేట్ గా వచ్చి కాసులు దండుకునేందుకు వ్యూహాలు మార్చేసుకుంటున్నారు.
ఇప్పటికే సంక్రాంతి రేస్ నుంచి పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ తప్పుకుందనే వార్తలు వస్తున్నా.. అదేం లేదు రావడం పక్కా అనే టాక్ కూడా వినిపిస్తోంది. కానీ త్రివిక్రమ్ మాత్రం ఈ రేస్ నుంచి బయటకొచ్చేయాలని డిసైడ్ అయ్యాడట. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజున.. ఈ లవ్ స్టోరీని తెరపైకి తేవాలని నితిన్, త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఓ లవ్ స్టోరీకి ఇంతకంటే మంచి డేట్ దొరకడం చాలా కష్టం. అందుకే ప్రేమికుల రోజున అనసూయా రామలింగం, ఆనంద్ విహారిల ప్రేమకథను రిలీజ్ చేయబోతున్నారన్న మాట.