Begin typing your search above and press return to search.
నితిన్ గేమ్ ప్లాన్ ఛేంజ్!
By: Tupaki Desk | 16 Aug 2018 6:52 AM GMTప్రతిభ ఎంత ఉన్నా టైమ్ కలిసి రావాలిక్కడ. డబ్బు ఎంత పెట్టినా లక్కు చిక్కాలి. సక్సెస్ వెంట పడే పరిశ్రమ ఇది. ఇలాంటి చోట ప్రతి సినిమా ఓ సవాల్ లాంటిది. వరుసగా హిట్లు కొడితేనే ఏ హీరోకి అయినా ఎదగడం సాధ్యం. దశాబ్ధకాలంపాటు వరుసగా 16 ఫ్లాప్‌లు అందుకుని, హ్యాట్రిక్ విజయాలతో తిరిగి తన పూర్వ వైభవాన్ని తెచ్చుకున్న నితిన్ మరోసారి డైలెమాలో పడ్డట్టే కనిపిస్తోంది. టాలీవుడ్ లో రేర్ ట్యాలెంటెడ్ హీరోగా నితిన్ కి పేరున్నా - ఎందుకనో విజయాలు దోబూచులాడుతున్నాయి. ఇష్క్ - గుండె జారి గల్లంతయ్యిందే - హార్ట్ ఎటాక్ లాంటి హిట్ సినిమాల్లో నటించి కాన్ఫిడెన్స్ పెంచుకున్న నితిన్ మళ్లీ ఎందుకనో తడబడుతున్నాడు. లై - శ్రీనివాసకళ్యాణం రూపంలో అతడికి ఊహించని జోల్ట్ తగిలింది. అయితే దెబ్బపడే కొద్దీ మొనదేలే కుబుసం లాంటోడు నితిన్. అతడిలో స్పార్క్ అలాంటిది. నైజాంలో టాప్ హీరోగా పేరున్న నితిన్.. ప్లానింగ్ లోనే ఏదో తేడా అన్న విశ్లేషణ సాగుతోందిప్పుడు.
అందుకే ఈ గండం నుంచి గట్టెక్కేందుకు - బయటపడేందుకు నితిన్ చాలా సీరియస్ గానే ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. తనకు సరైన గైడెన్స్ ఉన్నా.. సరైన ప్రచారం లేదన్నది అందరికీ తెలిసిన నిజం. ఇంత సాధిస్తే, అంత ప్రచారం చేసుకునే ఈ పరిశ్రమలో నితిన్ కి సరైన పబ్లిసిటీ లేదన్నది వాస్తవం. రీసెంటుగా `శ్రీనివాస కళ్యాణం` రిలీజ్ వేళ దిల్ రాజు గురించి మాట్లాడుకున్నంతగా - జనం నితిన్ గురించి మాట్లాడలేదంటే అర్థం చేసుకోవచ్చు. తన సినిమాల రిలీజ్ ల వేళ దిల్ రాజే హీరో అవుతున్నారు తప్ప హీరోలంతా జీరోలే అన్నట్టే కనిపిస్తోందన్న చెణుకులు వినిపించాయి. సరిగ్గా .. ఇదే.. ఇదే పాయింట్ నితిన్ ని ఆలోచింపజేసిందిట. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా అతడు తన పబ్లిసిటీ టీమ్ ని బలోపేతం చేసే దిశగా ప్లాన్ చేస్తున్నారట.
నవతరం హీరోలంతా పక్కాగా పీఆర్ ని మెయింటెయిన్ చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. అదే తీరుగా ఇప్పుడు నితిన్ కూడా తన పీఆర్ ని బలోపేతం చేసుకునే ప్లాన్ లో ఉన్నారని చెబుతున్నారు. ఇకపోతే పలు అగ్ర సంస్థలు సామాజిక మాధ్యమాల్లో ఎంతో జోరుగా ప్రచారం చేసుకుంటున్న సంగతి విదితమే. అదే తీరుగా నితిన్ రకరకాల ప్లాట్ ఫామ్ లలో తనకు ప్రచారం పెంచుకునే యోచనలో ఉన్నాడట. అందుకోసం పెర్ ఫెక్ట్ టీమ్ ని డిజైన్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది. ప్లాన్ బావుంది.. అయితే నీతి - నిజాయితీ - కసి ఉన్న టీమ్ తనతో పని చేస్తే అది కలిసొస్తుందనడంలో సందేహమే లేదు.