Begin typing your search above and press return to search.

స‌క్సెస్ కోసం ఆర్కిటెక్ట్ అవ‌తారం

By:  Tupaki Desk   |   1 May 2018 6:21 AM GMT
స‌క్సెస్ కోసం ఆర్కిటెక్ట్ అవ‌తారం
X
గ‌జినీ మ‌హ్మ‌ద్ కంటే ఎక్కువ సార్లు పోరాటం చేసి విజ‌యం ద‌క్కించుకున్న హీరో నితిన్‌. అయితే ల‌క్కీ గ‌ర్ల్ నిత్యామీన‌న్ హీరోయిన్ గా చేసిన ‘ఇష్క్‌’... నితిన్ ను మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కించింది. అయితే ‘అ ఆ’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం త‌ర్వాత మ‌నోడి ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. దాంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాల‌నే క‌సితో ఆర్కిటెక్ వేషం వేస్తున్నాడు నితిన్‌.

ప్ర‌స్తుతం ‘శ‌తమానం భ‌వతి’ వంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్కించిన స‌తీశ్ వేగ్నేశ ద‌ర్శ‌క‌త్వంలో ‘శ్రీ‌నివాస క‌ల్యాణం’ సినిమా చేస్తున్నాడు నితిన్‌. నితిన్ సినిమాల‌కు భిన్నంగా ఇది కూడా అనుబంధాలు- ఆత్మీయ‌త‌లు - కుటుంబ సంబంధాలు వివాహ బంధం విలువ‌ల్ని తెలియ‌చేసే చిత్రంగా తెర‌కెక్కిస్తున్నాడు స‌తీశ్‌. ఇందులో ఆర్కిటెక్ అవ‌తారంలో క‌నిపించ‌బోతున్నాడ‌ట నితిన్‌. అత‌ని పేరు కూడా శ్రీ‌నివాస్ అని తెలుస్తోంది. శ్రీ‌నివాస్ జోడి ప‌ద్మావ‌తిగా రాశిఖ‌న్నా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఛండీఘ‌ర్ లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తోంది చిత్ర బృందం. ఈ షెడ్యూల్ ఈ నెల 5తో ముగియ‌బోతోంది.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నితిన్ పాత్ర రొటీన్ కి భిన్నంగా ఉండ‌బోతుంద‌ని స‌మాచారం. ‘లై’- ‘ఛ‌ల్ మోహ‌న‌రంగ‌’ అంటూ రెండు దెబ్బ‌లు తిన్న నితిన్ కి ఈ స‌కుటుంబ స‌ప‌రివార చిత్ర‌మైనా స‌క్సెస్ ఇస్తుందేమో చూడాలి. ఇందులో ‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా’ ఫేం నందితా శ్వేతా కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.