Begin typing your search above and press return to search.
కృతి శెట్టి అమాయకురాలు కాదండోయ్: నితిన్
By: Tupaki Desk | 8 Aug 2022 3:33 AM GMTనితిన్ హీరోగా 'మాచర్ల నియోజక వర్గం' సినిమా రూపొందింది. పొలిటికల్ టచ్ తో నడిచే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాతో దర్శకుడిగా రాజశేఖర్ రెడ్డి పరిచయమవుతున్నాడు. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో నితిన్ జోడీగా కృతి శెట్టి .. కేథరిన్ అలరించనున్నారు. స్పెషల్ సాంగ్ లో అంజలి మెరవనుంది. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
ఈ వేదికపై నితిన్ మాట్లాడుతూ .. "నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అవుతోంది. మీ అందరి సపోర్టు లేకపోతే నేను ఈ రోజున ఇక్కడ ఉండేవాడిని కాదు. మరో 20 ఏళ్లపాటు మీ కోసం కష్టపడటానికి నేను రెడీగా ఉన్నాను. ఈ సినిమాలో నాతో పాటు కలిసి నటించిన రాజేంద్ర ప్రసాద్ గారికీ .. వెన్నెల కిశోర్ గారికి .. బ్రహ్మాజీ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఇక సముద్రఖని గారు ఈ సినిమా కోసం ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్స్ ఇచ్చారు. ఆయనతో కలిసి మళ్లీ మళ్లీ నటించాలని ఉంది .. ఆయన దర్శకత్వంలో కూడా నటించాలని ఉంది.
ఈ సినిమాలో వెన్నెల కిశోర్ కామెడీ హైలైట్ గా ఉంటుంది. మా ఇద్దరి కాంబినేషన్ లోని సీన్స్ చాలా బాగుంటాయి. సినిమా చూసిన తరువాత ఆయన ఈ సినిమాకి బ్యాక్ బోన్ అని మీరే అంటారు. ఈ సినిమాకి కథ .. మాటలు .. పాటలు బాగా కుదిరాయి.
మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు .. ఆడియో పెద్ద హిట్ అవుతుంది. సాధారణంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో మణిశర్మగారు కింగ్ అంటారు. ఈ సినిమా చూసిన తరువాత మహతి స్వరసాగర్ ను తండ్రికి తగిన తనయుడు .. తండ్రిని మించిన తనయుడు అంటారు.
కృతి శెట్టి చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తుంది .. కానీ ఆమె చాలా షార్ప్. తను చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది .. ఎక్కడ ఏ డౌట్ వచ్చినా అడిగేస్తుంది. చాలా తక్కువమంది హీరోయిన్స్ లో ఉండే క్వాలిటీస్ ఆమెలో కనిపిస్తాయి. తప్పకుండా తన కెరియర్ కి లాంగ్ రన్ ఉంటుందని భావిస్తున్నాను.
నాలాగే తాను ఓ 20 ఏళ్లు కుమ్మేయాలి. సినిమాలో డాన్సులు ... ఫైట్లు చాలా బాగా కుదిరాయి. నా కెరియర్ లో బెస్ట్ ఫైట్స్ ఈ సినిమాలో ఉంటాయి. శేఖర్ ఈ సినిమాను చాలా గొప్పగా తీశాడు. ఆగస్టు 12న గట్టి హిట్ కొట్టబోతున్నామనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. మీరంతా ఈ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.