Begin typing your search above and press return to search.

ప్రమోషన్ ఇంటర్వ్యూలు కాస్తా..పర్సనల్స్ కే సరిపోతుందా?

By:  Tupaki Desk   |   16 Feb 2020 7:30 PM GMT
ప్రమోషన్ ఇంటర్వ్యూలు కాస్తా..పర్సనల్స్ కే సరిపోతుందా?
X
ఇటీవల కాలంలో ఏ టాలీవుడ్ హీరోకు ఎదురుకాని పరిస్థితి నితిన్ కు ఎదురవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా విడుదల అవుతుందంటే.. ప్రతిక్షణం దాని గురించే మాట్లాడటం.. ఎంత కుదిరితే అంత ఆ సినిమాను ప్రమోట్ చేస్తూ.. థియేటర్ల వద్దకు ప్రేక్షకుల్ని రప్పించేందుకు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. అందుకు భిన్నంగా చోటు చేసుకుంటున్న పరిణామం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నితిన్ నటించిన భీష్మ ఈ వారం విడుదల కానుంది. దీంతో.. సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ ఊపందుకున్నాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇటీవల అతగాడి రియల్ లవ్ స్టోరీ బయటకు రావటం.. పెళ్లి ఫిక్స్ కావటంతో మీడియా ఆసక్తి అంతా ఆ అంశాల మీదనే ఉంది. సినిమా ప్రమోషన్ కోసం మీడియా ఇంట్రాక్షన్ ఏర్పాటు చేసినా.. స్పెషల్ ఇంటర్వ్యూలు పెట్టినా.. సినిమా గురించి ప్రశ్నలు అడిగే కన్నా.. ప్రేమ.. పెళ్లికి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా అడుగుతున్నారట.

దీంతో.. పర్సనల్ విషయాలు ఇవాళ కాకుంటే రేపైనా మాట్లాడుకోవచ్చు.కానీ.. వారం.. రెండు వారాలే సినిమా ఆయుష్షుగా మారిన ఇప్పటి రోజుల్లో కీలకమైన రోజులన్ని వ్యక్తిగత విషయాలే మీడియాలో ఎక్కువగా వస్తే.. ఈ వారమే విడుదలయ్యే భీష్మ సంగతి ఏమిటి? అన్న ప్రశ్న వినిపిస్తోంది.