Begin typing your search above and press return to search.

చరణ్ వెర్సస్ అఖిల్.. పర్లేదంటున్నాడు

By:  Tupaki Desk   |   16 Sep 2015 9:30 AM GMT
చరణ్ వెర్సస్ అఖిల్.. పర్లేదంటున్నాడు
X
ఒకప్పుడు సంక్రాంతి, దసరా లాంటి సీజన్లలో ఒకేసారి మూణ్నాలుగు సినిమాలు విడుదలయ్యేవి. కానీ ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలు విడుదల చేయడానికి కూడా సంశయమే. వసూళ్లన్నీ ఓపెనింగ్స్ మీదే ఆధారపడి ఉండటంతో ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు విడుదలవడం అసాధ్యంగా మారిపోయింది. ఒకే రోజని కాదు.. వారం గ్యాప్ లో కూడా రెండు పెద్ద సినిమాల్ని తేవడానికి నిర్మాతలు ఇష్టపడట్లేదు. ఈ ఏడాదిలో ఏ రెండు పెద్ద తెలుగు సినిమాలు కూడా వారం గ్యాప్ లో రాలేదు. ఐతే వచ్చే నెల దసరా సందర్భంగా మాత్రం రెండు భారీ సినిమాలు వారం వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అవే.. బ్రూస్ లీ, అఖిల్. ఈ రెండు సినిమాలు వేటికవే ప్రత్యేకం. అంచనాలు ఆకాశాన్నంటేలా ఉన్నాయి. ముందేదో రిలీజ్ డేట్ ఇచ్చేశారు కానీ.. తర్వాత వెనక్కి తగ్గుతారేమో అనుకుంటే అలాంటిదేమీ లేదని తేలిపోయింది.

‘అఖిల్’ నిర్మాత నితిన్ మాటల్ని బట్టి చూస్తుంటే బ్రూస్ లీ వచ్చిన వారానికే తమ సినిమాను విడుదల చేయబోతున్నట్లు స్పష్టమైంది. దీని గురించి అతను స్పందిస్తూ.. ‘‘ఇదివరకు పండక్కి ఒకేసారి మూడు సినిమాలొచ్చేవి. మూడింటినీ జనాలు చూసేవారు. అయితే ఇప్పుడు పద్ధతి మారింది. ఐతే వసూళ్ల విషయంలో తొలి వారమే ముఖ్యం. రెండో వారం ఇంకో సినిమా వచ్చినా ఇబ్బంది లేదు. కాబట్టి వారం రోజుల గ్యాప్ సరిపోతుందని భావించి.. బ్రూస్ లీ వచ్చిన వారానికే మా సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్సయిపోయాం’’ అని నితిన్ చెప్పాడు. అఖిల్ సినిమా బడ్జెట్ పెరిగిపోయిందన్న వార్తల గురించి మాట్లాడుతూ.. ‘‘కథ అలాంటిదండీ. మేం ఎక్కడా వృథాగా ఖర్చు పెట్టలేదు. ఆఫ్రికా - యూరప్ - బ్యాంకాక్.. ఇలా కథ డిమాండ్ చేసిన ప్రతి చోటికీ వెళ్లి షూటింగ్ చేశాం’’ అన్నాడు. సినిమాకు సంబంధించి లీకైన షాట్లు ప్రచారం కోసం చేసినవి కాదని నితిన్ చెప్పాడు. ‘‘మా సినిమాకు ఇప్పటికే కావాల్సినంత హైప్ వచ్చింది. ప్రత్యేకంగా మేమేమీ చేయనక్కర్లేదు. స్పెయిన్ లో తీసినప్పుడు అక్కడి మీడియా కొన్ని సన్నివేశాలు క్యాప్చర్ చేసి ఆన్ లైన్ లో పెట్టింది. అఖిల్ ఫ్యాన్స్ వాటిని డౌన్ లోడ్ చేశారు. అంతే’’ అన్నాడు.