Begin typing your search above and press return to search.
అఖిల్ ఆడియోకి పవన్ రావట్లే??
By: Tupaki Desk | 15 Sep 2015 1:30 PM GMTఅక్కినేని హీరో అఖిల్ నటిస్తున్న అఖిల్ ఆడియోకి ముఖ్య అతిధులెవరు? ఈ ప్రశ్నకు సమాధానం స్పష్టంగా రాలేదింకా. ఈ సినిమా నిర్మాత నితిన్ నుంచి అప్ డేట్ ఏదైనా తెలుస్తుందేమోనని ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే .. ఇంకా అతిధుల్ని ఎవరినీ పిలవలేదు అని అన్నాడు. అంటే ఇప్పటికైతే పవన్ కి ఆతిథ్యం అందలేదు.
అలాగే పవర్ స్టార్ సర్ధార్ గబ్బర్ సింగ్ బిజీలో ఉన్నాడు కాబట్టి ఈ ఆడియోకి వచ్చే ఆస్కారమే లేదు. అయినా అక్కినేని హీరో అంటే కింగ్ నాగార్జున అండ్ ఫ్యామిలీతోనే స్టేజీ కళకళలాడేస్తుంది. అక్కినేని హీరోలతోనే స్టేజీ సగం నిండిపోతుంది. నాగార్జున - నాగచైతన్య - సుశాంత్ - సుమంత్ ఇలా హీరోలంతా వేదిక పైకి వస్తారు. ఇదే వేదికపై మెగా ఫ్యామిలీ నుంచి హీరో కావాలనుకుంటే.. చిరుని ఆహ్వానిస్తే సరి. ఎలానూ నాగార్జునకి మెగాస్టార్ చిరంజీవి స్నేహితుడు కాబట్టి చిరంజీవిని ఆహ్వానిస్తే ఆయన ఓకే అనకుండా ఉండలేరు. అసలు ఆడియోలకు రాను దేవుడోయ్ .. అంటున్న పవన్ నే ఎందుకు ఇబ్బంది పెట్టాలి. మరి నిర్మాత నితిన్ ఏం ఆలోచిస్తున్నాడు? తన ఫేవరెట్ అయినంత మాత్రాన పవన్ రావాలని పట్టుబట్టాల్సిన పనేంలేదు. సాదరంగా ఆహ్వానించినప్పుడు వీలుంటే రావొచ్చు. కుదరకపోతే కుదరలేదని చెప్పొచ్చు. అఖిల్ ఆడియోకి పవన్ రాడు అన్న ఇన్ ఫర్మేషన్ నితిన్ కి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రశ్నే తలెత్తదు.
ఇదంతా సరే ఒకవేళ పవన్ కల్యాణ్ తో సినిమా నిర్మిస్తావా వీలుంటే? అని ప్రశ్నిస్తే ఠకీమని స్పందించాడు నితిన్. పవన్ ఓకే చెబితే నా సినిమాలన్నీ పక్కన పెట్టేసి వెంటనే సినిమా తీస్తానని అన్నాడు. ప్రస్తుతానికైతే అది లేదని తెలిపాడు.. అదీ సంగతి.