Begin typing your search above and press return to search.
నితిన్ సోలో రైడింగ్ అన్నమాట
By: Tupaki Desk | 5 Sep 2015 9:58 AM GMTఅసలు విడుదలే కాదనుకున్న సినిమా సరైన టైమింగ్ తో, మంచి క్రేజ్ మధ్య సోలోగా విడుదలవుతుంటే ఆ హీరో ఆనందానికి అవధులుండువు. ఇప్పుడు నితిన్ ఆ ఆనందాన్నే అనుభవించబోతున్నాడు. దాదాపు రెండేళ్లు ఆలస్యంగా రాబోతున్న కొరియర్ బాయ్ కళ్యాణ్ వచ్చే శుక్రవారం సోలోగా రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి సెప్టెంబరు 11న కొరియర్ బాయ్ కళ్యాణ్ తో పాటు తేజ సినిమా ‘హోరాహోరీ’ కూడా విడుదల కావాల్సింది. ఐతే అనివార్య కారణాల వల్ల ఆ సినిమా వచ్చే శుక్రవారం రిలీజ్ కావట్లేదని సమాచారం.
హోరాహోరీతో పోలిస్తే నితిన్ సినిమాకే క్రేజ్ ఎక్కువన్నది వాస్తవమే కానీ.. తేజ ఈజ్ బ్యాక్ అనిపించేలా ఉన్న ప్రోమోస్, ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచుతున్నాయి. కాబట్టి పోటీ ఉంటే నితిన్ కు కొంచెం కష్టమే. పైగా ఈ వారం విడుదలైన భలే భలే మగాడివోయ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. డైనమైట్ కూడా స్టడీగానే ఉంది. తేజ సినిమా వెనక్కి తగ్గడానికి కూడా ఇదీ ఓ కారణం కావచ్చు.
అగ్ర దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మించిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమాకు ఒకప్పటి సీరియల్ నటుడు ప్రేమ్ సాయి దర్శకత్వం వహించాడు. అతడికిదే తొలి సినిమా. ఇండియన్ స్క్రీన్ పై ఇలాంటి పాయింటుతో సినిమా రాలేదని చెప్పడం ద్వారా నితిన్ ఆసక్తి రేపాడు. బాలీవుడ్ భామ యామి గౌతమ్.. నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది. లేటుగా వస్తున్నప్పటికీ ఫ్రెష్ గా అనిపిస్తున్న ఈ సినిమా నితిన్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.