Begin typing your search above and press return to search.

నిశ్చితార్థంలో చూడముచ్చటగా హీరో నితిన్ ఫియాన్సీ!!

By:  Tupaki Desk   |   22 July 2020 4:00 PM GMT
నిశ్చితార్థంలో చూడముచ్చటగా హీరో నితిన్ ఫియాన్సీ!!
X
హీరో నితిన్ అతని ప్రేయసి షాలిని నేడు ఉంగరాలు మార్చుకొని నిశ్చితార్థం తంతు ముగించుకొన్నారు. వీరి నిశ్చితార్థం హైదరాబాద్‌లో నితిన్ స్వగృహంలో ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నిబంధనలను అనుసరిస్తూ కొద్దిమంది సన్నిహితుల మధ్య ఈ నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. ఈ నేపథ్యంలో నితిన్ తన ఫియాన్సీ షాలిని ఉంగరాలు మార్చుకునే ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో షాలిని సిగ్గుపడుతూ కనిపించింది. ఈ ఎంగేజ్మెంట్ వేడుకలో కాబోయే నితిన్, షాలిని జంట ప్రస్తుతం హైలైట్ అవుతోంది. అయితే వీరి పెళ్లి ఈనెల 26న ఫలక్నుమా ప్యాలస్ లో జరగనుంది. రాత్రి 8:30 గంటలకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటి కానున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ పెళ్లిని చాలా సింపుల్‌గా నిర్వహించాలని నిర్ణయించారు.

అయితే వీరి పెళ్లికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరుకానున్నట్లు సమాచారం. ఇటీవల నితిన్ స్వయంగా ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌కు శుభలేఖ అందజేసిన విషయం తెలిసిందే. అయితే ఎంగేజ్మెంట్ కార్యక్రమం తర్వాత షాలిని కెమెరా కంటికి చిక్కింది. ఆమె ఎంతో అందంగా నితిన్ పక్కన చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నాగర్ కర్నూల్‌కు చెందిన డాక్టర్‌ సంపత్‌ కుమార్‌, డాక్టర్ నూర్జహాన్ దంపతుల కూతురు షాలిని. నితిన్ తో షాలిని పరిచయం ఎనిమిదేళ్ల కిందటే అయ్యిందట. 2012లో షాలిని నితిన్ ఫస్ట్ మీటింగ్. ఆ తర్వాత స్నేహం.. అది కాస్త ప్రేమగా మారేసరికి పెళ్లి వైపు అడుగులేశారు ఈ జంట. ఐదేళ్ల ప్రేమ తర్వాత ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతోనే ఒక్కటి కాబోతున్నారు. అయితే షాలిని కూడా డాక్టర్ అని తెలుస్తుంది.