Begin typing your search above and press return to search.
నితిన్ ఓ ఇంటివాడైతే చూడాలనుందట
By: Tupaki Desk | 7 Aug 2016 7:46 AM GMTప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో నితిన్ ఒకడు. ఐతే 33 ఏళ్లు వచ్చేస్తున్నా నితిన్ మాత్రం ఇంకా పెళ్లి ఊసు ఎత్తట్లేదు. ఐతే నితిన్ త్వరగా పెళ్లిచేసుకుంటే చూడాలని అంటోంది నీరజ కోన. టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ స్టైలిస్టుల్లో ఒకరైన నీరజకు నితిన్ చాలా మంచి ఫ్రెండు. ఈ రోజు ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా వీళ్లిద్దరూ కలిసి ఓ ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా నితిన్ గురించి నీరజ స్పందిస్తూ.. ‘‘నితిన్ హీరోగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నాను. వ్యక్తిగతంగా పెళ్లి చేసుకుని జీవితంలో ఓ ఇంటివాడైతే చూడాలనుంది. తనకు సరిజోడీని ఎప్పుడు వెతుక్కుంటాడా అని ఎదురుచూస్తున్నాను. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా సందర్భంగా మా ఇద్దరికీ పరిచయమైంది. చాలా త్వరగా మంచి స్నేహితులయ్యాం. నిజానికి చిత్ర పరిశ్రమలో మంచి స్నేహితులు దొరకడం చాలా కష్టం. ఈ విషయంలో నేను చాలా లక్కీ. నాకు గొప్ప స్నేహితులు దొరికారు. అందులో నితిన్ ఒకడు. వెరీ డౌన్ టు ఎర్త్. ఓ హీరోలా అనిపించడు. పక్కింటి కుర్రాడిలానే ఉంటాడు. చాలా మంచోడు’’ అంటూ నితిన్ ను పొగిడేసింది నీరజ.
ఇక నీరజ గురించి నితిన్ మాట్లాడుతూ.. ‘‘నీరూ నాకు అత్యంత క్లోజ్ అయిన స్నేహితుల్లో ఒకరు. మా పరిచయం అయిన కొన్నాళ్లకే క్లోజ్ అయ్యాం. మా ఇద్దరి మధ్య ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆమెకు పెళ్లి అయినా సరే మా స్నేహానికి ఢోకా లేదు. నిజానికి తన పెళ్లి వల్ల నాకు ఇంకో మంచి ఫ్రెండు దొరికాడు. నీరజ భర్త అజయ్ కూడా నాకు చాలా క్లోజ్. నీరూ ప్రొఫెషనల్ గా ఇంకా ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నా. ఫ్యాషన్ డిజైనింగ్ లో తనకంటూ ఓ సొంత బ్రాండ్ ప్రారంభించాలన్నది తన లక్ష్యం. అది నెరవేరాలని ఆశిస్తున్నా’’ అని నితిన్ చెప్పాడు.