Begin typing your search above and press return to search.

నితిన్.. దుబాయ్ లో డెస్టినేష‌న్ పెళ్లి?

By:  Tupaki Desk   |   14 Jan 2020 10:13 AM GMT
నితిన్.. దుబాయ్ లో డెస్టినేష‌న్ పెళ్లి?
X
హీరో నితిన్ పెళ్లి వార్త వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ లో నితిన్ పెళ్లాడ‌బోతున్నాడ‌ని ఇప్ప‌టికే ప్ర‌చార‌మైంది. అయితే ఈ పెళ్లికి సంబంధించి తెలిసింది చాలా త‌క్కువ స‌మాచారం మాత్ర‌మే. తాజా స‌మాచారం ప్ర‌కారం.. నితిన్ ల‌వ్ కం ఎరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడ‌న్న విష‌యం లీకైంది.

నితిన్ ఎన్నారై గాళ్ ని ప్రేమించాడు. అమెరికాలో పీజీ చేసిన షాలిని అనే స్టూడెంట్ ని పెళ్లాడ‌బోతున్నాడు. ఏప్రిల్ 16న ఈ జంట‌ వివాహం జ‌ర‌గ‌నుంది. దుబాయ్ లో డెస్టినేష‌న్ వెడ్డింగ్ కి ఇరువైపులా పేరెంట్ ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇక డెస్టినేష‌న్ వెడ్డింగ్ అంటే కొద్దిమంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో మాత్ర‌మే ఈ వివాహం జ‌రిగే వీలుంద‌ని భావిస్తున్నారు.

ఇది ప్రేమ పెళ్లి. గుట్టు చ‌ప్పుడు కాకుండా నాలుగేళ్లుగా ప్రేమాయ‌ణం సాగించార‌న్న కొత్త విష‌యం తాజాగా రివీలైంది. ఇక ఇద్ద‌రూ ఇంత‌కాలం డేటింగ్ చేశాకే పెద్ద‌ల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నార‌ని తెలుస్తోంది. నితిన్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాల‌తో బిజీ. భీష్మ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యాక రంగ్ దే షూటింగులో పాల్గొన‌నున్నాడు. మ‌రిన్ని స్క్రిప్టుల్ని లాక్ చేసిన సంగ‌తి తెలిసిందే.