Begin typing your search above and press return to search.
నార్త్ ఇండియాలో క్రేజీ హీరోగా మారిపోయిన నితిన్...!
By: Tupaki Desk | 6 May 2020 4:32 PM GMT'జయం' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుపెట్టాడు యంగ్ హీరో నితిన్. ఆ తర్వాత వచ్చిన 'దిల్' సినిమాతో యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరైపోయాడు. హిట్ ప్లాపులను పట్టించుకోకుండా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. 'సై' 'గుండెజారి గల్లంతయ్యిందే' 'హార్ట్ ఎటాక్' 'ఇష్క్' 'అ ఆ' సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో ‘భీష్మ’ సినిమాతో బంపర్ హిట్ అందుకున్న హీరో నితిన్ జోరు మీద ఉన్నారు. అదే ఊపులో యువ దర్శకుడు వెంకీ అట్లూరితో ‘రంగ్ దే’ అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ విధంగా టాలీవుడ్ లో వరుస సినిమాలతో క్రేజీ హీరోగా మారిపోయి మంచి మార్కెట్ క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాడు. అంతేకాకుండా ప్రస్తుతం హిందీలో కూడా నితిన్ కి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. నితిన్ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసి వదిలితే నార్త్ ఇండియన్స్ ఎగబడి సినిమాలను చూసేస్తున్నారు.
నితిన్ నటించిన సూపర్ హిట్ సినిమాలు 'అ ఆ' 'చల్ మోహన్ రంగ' 'శ్రీనివాస కళ్యాణం' హిందీ డబ్ వెర్షన్ కు ఓవర్ ఆల్ గా 400 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. ఇందులో దాదాపు 'అ ఆ' కు 182 మిలియన్ల వ్యూస్.. 'అ ఆ 2' (ఛల్ మోహన్ రంగ హిందీ వెర్షన్) కు 112 మిలియన్ల వ్యూస్.. 'శ్రీనివాస కళ్యాణం'కు 100 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంటే 400 మిలియన్ల వ్యూస్ తో నితిన్ కి సంబంధించిన మూడు సినిమాలు యూట్యూబ్ లో సెన్షేషన్ క్రియేట్ చేస్తున్నాయని చెప్పవచ్చు. ఈ విషయాన్ని స్వయంగా సౌత్ ఇండియాలోనే అగ్రగామి మ్యూజిక్ కంపెనీగా కొనసాగుతున్న ఆదిత్య మ్యూజిక్ కి చెందిన ఆదిత్య మూవీస్ వారు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ మూవీస్ లో 'చల్ మోహన్ రంగ' 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలు తెలుగులో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయాయి. కానీ హిందీలో మాత్రం మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్నాయి.
దీనిని బట్టి చూస్తేనే అర్థం అవుతుంది నార్త్ ఇండియాలో నితిన్ కి ఉన్న క్రేజ్ ఏంటనేది. వాస్తవానికి యాక్షన్ మూవీస్ ఇష్టపడే నార్త్ ఆడియన్స్.. 'అ ఆ' వంటి ఫ్యామిలీ సినిమాని విశేషంగా ఆదరించారు. అనూహ్యంగా 'అ ఆ' తరువాత నితిన్ వరుస పెట్టి చేసిన ఫ్యామిలీ టైపు సినిమాలు 'చల్ మోహన్ రంగా' 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలకి భారీగా స్పందన లభించడం విశేషం. దీంతో నితిన్ మార్చిన ట్రాక్ తనకి తెలుగుతో పాటు నార్త్ లో కూడా క్రేజ్ తీసుకొచ్చిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే నితిన్ నటించిన బ్లాక్ బస్టర్ 'భీష్మ' సినిమాని హిందీలో రీమేక్ చేయాలని బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ పోటీపడి రైట్స్ కొనుకున్న సంగతి తెలిసిందే.