Begin typing your search above and press return to search.
నితిన్ పెద్ద మనసు
By: Tupaki Desk | 23 Jan 2018 6:28 AM GMTభారీ స్థాయిలో నిర్మాణం జరిగి అంచనాలు అందుకోలేక ఏదైనా సినిమా పరాజయం పాలైనప్పుడు నిర్మాతకు జరిగే ఆర్థిక నష్టం గురించి మీడియాలో ఒకటి రెండు రోజులు వార్తలు వస్తాయి కాని ఆ తర్వాత పట్టించుకునే వారు ఎవరు ఉండరు. హిట్ అయితే ఎటువంటి సమస్యా ఉండదు కాని ఫ్లాప్ అయితే సదరు నిర్మాత చవిచూసే నరకం వారికి మాత్రమే తెలుస్తుంది. గత కొంత కాలంగా టాలీవుడ్ లో ఈ పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. హీరోల ఇమేజ్ ను దర్శకుల మీద క్రేజ్ ను ఆధారంగా చేసుకుని కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి కథాకథనాలు తేడాగా అనిపించినా సినిమాలు చుట్టేసి దెబ్బ తింటున్న నిర్మాతలను చూస్తూనే ఉన్నాం. వాళ్ళు కొద్దిగా రికవర్ అవ్వడానికి సహాయం చేయడానికి అవకాశం ఉన్న వ్యక్తులు ఇద్దరు ఉంటారు. ఒకరు హీరో. రెండు దర్శకుడు.
నితిన్ ఈ విషయంలో బాధ్యత తీసుకుని ఫ్లాప్ కు తాను మాత్రమే బాధ్యత కాకపోయినా తన వంతుగా సహాయం చేయడానికి ముందుకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత సంవత్సరం ఆగష్టులో విడుదలైన నితిన్ లై సినిమాను 14 రీల్స్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. సగానికి పైగా పూర్తిగా విదేశాల్లో చిత్రీకరించిన ఆ మూవీ కాస్ట్ పరంగానే కాకుండా రిజల్ట్ పరంగా కూడా డిజాస్టర్ గా మిగిలి నిర్మాతలకు తీవ్ర నష్టాలు చూపించింది. దీంతో కొత్త ప్రాజెక్ట్ ఏది టేకప్ చేయకుండా సైలెంట్ గా ఉన్న సదరు సంస్థకు నితిన్ తక్కువ రెమ్యునరేషన్ లో మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చాడట. బడ్జెట్ కూడా చాలా లిమిటెడ్ గా పెట్టుకుని పూర్తి చేయమని, దాని వల్ల సేఫ్ గా ఉండటంతో పాటు లాభాలు కూడా వస్తాయని చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం దీని కోసం కథా చర్చలు జరుగుతున్నాయి.
నితిన్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ జంట నిర్మాతలుగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో చేస్తున్నది ఒకటి కాగా వేగ్నేశ సతీష్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోయే ‘శ్రీనివాస కళ్యాణం’ రెండోది. అవి పూర్తయ్యే లోపు 14 రీల్స్ సంస్థ స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉండేందుకు ప్రణాళికలో ఉంది. నితిన్ ఇలా చేయటం ద్వారా మంచి సంకేతాలే ఇచ్చాడు. గతంలో నితిన్ గురువుగా భావించే పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ వల్ల నష్టపోయిన శరత్ మరార్ కు కాటమ రాయుడు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో నితిన్ పవన్ నే స్ఫూర్తిగా తీసుకున్నాడు కాబోలు.